ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు పరిహారం ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-11-24T05:14:06+05:30

గిద్దలూరు నియోజకవర్గంలో తుఫాన్‌ ప్రభావంతో కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

నష్టపోయిన  పైర్ల పరిశీలన

కంభం, నవంబరు 23 : గిద్దలూరు నియోజకవర్గంలో తుఫాన్‌ ప్రభావంతో కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని  మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం అర్ధవీడు మండలం నాగులవరం గ్రామంలో రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. ఈసందర్భంగా రైతు లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేసిన పంటలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క నాగులవరంలోనే 3 వేల ఎకరాలకు పైగా శనగ, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు రైతుల కోసం ఎటువంటి నష్టనివారణ చర్యలు తీసుకోలేదన్నారు. ఈసందర్భంగా పొలాల్లో మునిగిపోయిన పప్పుశనగ, మొలకెత్తిన మిర్చి పంటలను అశోక్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంలో 25వేల ఎకరాలకు పైగా పప్పుశనగ, 10వేల ఎకరాల్లో మిర్చి, 10వేల ఎకరాలకు పైగా కందిపంటలు వేసి నష్టపోయారన్నారు. నియోజకవర్గంలో 6 మండలాల్లో పంట నష్టపోయిన శనగ రైతులకు ఎకరాకు 20వేలు, మిర్చి ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ప్రభు త్వం తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు నష్టపరిహారం సాధ్యమైనంత త్వరగా అందచేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతులు, మండల నాయకులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-11-24T05:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising