ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్న కండ్లేరు చెరువుకు గండి

ABN, First Publish Date - 2021-12-19T07:18:10+05:30

జిల్లాలోనే అతిపెద్ద రెండో చెరువు అయిన పుల్లలచెరువు చిన్నకండ్లేరుకు గండిపడింది.

చిన్నకండ్లేరు చెరువు గండి నుంచి ఉధృతంగా బయటకు వెళ్తున్న నీరు (ఇన్‌సెట్‌లో) గండి పడిన ప్రాంతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న కండ్లేరు చెరువుకు గండి

మట్టి వేస్తున్నా ఆగని నీరు

కట్ట తెగితే 4వేల ఎకరాల్లో  పంట మునిగే ప్రమాదం

భయాందోళనలో రైతులు

పుల్లలచెరువు, డిసెంబరు 18 : జిల్లాలోనే అతిపెద్ద రెండో చెరువు అయిన పుల్లలచెరువు చిన్నకండ్లేరుకు గండిపడింది. మొదట తూము నుంచి నీరు లీకైంది. శనివారం సాయంత్రం 5గంటల సమయంలో ఏకంగా గండి పడింది. దీంతో నీరు ఉధృతంగా బయటకు పోతోంది. ఇరిగేషన్‌, పోలీస్‌ శాఖ అధికారులు, గ్రామస్థులు, రైతులు గండి పూడ్చేందుకు రాత్రంతా మట్టిపోసే పనులు చేస్తున్నారు. అయినప్పటికీ కట్టడి చేయలేకపోయారు.  జేసీబీలు, ట్రాక్టర్ల ద్వారా మట్టి పోయిస్తున్నప్పటికీ 25 అడుగుల మేరకు నీటిమట్టం ఉండటంతో నీటి ఉధృతికి వేసిన మట్టి వేసినట్లే కొట్టుకుపోతోంది. దీంతో కట్ట దిగువ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. కట్ట తెగితే దానికింద 4వేల ఎకరాల్లో తమ పంటలు కొట్టుకుపోతాయని భయపడుతున్నారు. గండిని పూడ్చేందుకు ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గత నెలలో తిరుపతిలో రాయల చెరువుకు గండి పడినప్పుడు అక్కడి అధికారులు ఇసుక, సిమెంట్‌ బస్తాలతో పూడ్చారు. దీంతో  ప్రమాదం నుంచి బయట పడ్డారు. చిన్నకండ్లేరు చెరువుకు పడిన గండిని కూడా పూడ్చాలంటే మట్టితో అయ్యే పని కాదని, ఇక్కడ కూడా సిమెంట్‌, ఇసుక బస్తాలు వాడాల్సిందేనని పలువురు సూచిస్తున్నారు. తెల్లవారేసరికి అధికారులు ఎలాంటి చర్యలతో గండిని పూడ్చి, నీటి ఉధృతిని నిలువరిస్తారో చూడాలి. ఈ విషయంపై మండల ఇరిగేషన్‌ ఏఈ సుధాకర్‌  మాట్లాడుతూ.. చిన్న కండ్లేరు చెరువు తూము నుంచి లీకేజీ కాకుండా అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. శనివారం రాత్రంతా అడ్డుకట్ట వేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. 




Updated Date - 2021-12-19T07:18:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising