ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలాఖరుకు కందుకూరుకు ఇన్‌చార్జ్‌

ABN, First Publish Date - 2021-04-03T06:07:26+05:30

తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికలు పూర్తయిన వెంటనే కందుకూరు నియోజక వర్గానికి పూర్తిస్థాయిలో టీడీపీ ఇన్‌చార్జ్‌ని నియమిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చెప్పారు.

రాజుపాలెం గ్రామస్థులతో మాట్లాడుతున్న నారా లోకేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌

రాజుపాలెం(ఉలవపాడు) : తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికలు పూర్తయిన వెంటనే కందుకూరు నియోజక వర్గానికి పూర్తిస్థాయిలో టీడీపీ ఇన్‌చార్జ్‌ని నియమిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చెప్పారు. శుక్రవారం ఆయన తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో పాల్గొనెందుకు వెళుతూ.. రాజుపాలెం వద్ద ఆగారు. కార్యకర్తల కోలాహలం చూసి వారితో మాటామంతి కలిపారు. స్థానికంగా పార్టీ పరిస్థితులను, అడిగి తెసుకున్నారు. పార్టీకి కార్యకర్తల బలం ఉన్నప్పటికి నియోజక వర్గ బాధ్యుడు లేనందున టీడీపీ క్యాడర్‌లో అయోమయం నెలకొందని కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన ఈ నెలాఖరకు పూర్తిస్థాయి ఇన్‌చార్జిని నియమించే యోచనలో పార్టీ జాతీయ అధ్యక్ష్యడు చంద్రబాబు ఉన్నాడని కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపాడు.  కార్యక్రమంలో తెలుగుయువత మండల నాయకులు కందగడ్ల వరుణ్‌, యువనాకులు అమ్మనబ్రోలు కిరణ్‌కుమార్‌, హరికృష్ణాపురం హరిబాబు, చక్రవర్తుల విజయకుమార్‌, శివకుమార్‌, రమేష్‌, బ్రహ్మయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-03T06:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising