ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్లలో రూ.1364 కోట్ల అభివృద్ధి పనులు

ABN, First Publish Date - 2021-05-31T05:18:07+05:30

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో మార్కాపురం నియోజకవర్గంలో రూ. 1364 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభమైనట్లు ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తెలిపారు. మండలంలోని రాయవరంలో మెడికల్‌ కళాశాల శంకుస్థాపన పనులను జేసీ చేతన్‌తో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను ఇప్పటికి 95 శాతం అమలు చేశారన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన

ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి

మార్కాపురం, మే 28: వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో మార్కాపురం నియోజకవర్గంలో రూ. 1364 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభమైనట్లు ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తెలిపారు. మండలంలోని రాయవరంలో మెడికల్‌ కళాశాల శంకుస్థాపన పనులను జేసీ చేతన్‌తో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను ఇప్పటికి 95 శాతం అమలు చేశారన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజల చిరాకాల స్వప్నమైన వైద్య కళాశాల ఏర్పాటుకు సోమవారం ఉదయం 11 గంటలకు వర్చువల్‌ విధానంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షంషీర్‌ అలీబేగ్‌ , వైసీపీ నాయకులు చెంచిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. జగన్మోహన్‌రెడ్డి పదవి చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం స్థానిక గడియార స్తంభం వద్ద గల వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు.  

మాజీఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి గృహంలో...

సీఎంగా జగన్మోహన్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు అయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఇంట్లో వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా లీగల్‌ సెల్‌ కార్యదర్శి గాంఽధీరెడ్డి, సేవా దళ్‌ కార్యదర్శి పంబి వెంకటరెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-31T05:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising