ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల విలువ మేరకు నష్టపరిహారం చెల్లించాలి

ABN, First Publish Date - 2021-05-02T06:11:08+05:30

నష్టపోయిన భూములు, ఇంటి స్థలాలకు సరైన నష్ట పరిహారం చెల్లించాలని రైతులు, నిర్వా సితులు జేసీ మురళికి విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీ మురళికి  రైతుల విజ్ఞప్తి  

త్రిపురాంతకం, మే 1 : నష్టపోయిన భూములు, ఇంటి స్థలాలకు సరైన నష్ట పరిహారం చెల్లించాలని రైతులు, నిర్వా సితులు జేసీ మురళికి విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న నేషనల్‌ హైవే 544డీ లో రైతులు కోల్పోయిన, భూములు, ఇంటి స్థలాలను జాయింట్‌ కలెక్టర్‌ వెంకటమురళి పరిశీలించారు. శనివారం వెల్లంపల్లి వచ్చిన జేసీ మురళి మొత్తం నిర్వాసితుల వివరాలు, నష్టపరిహార ధరలపై స్థానిక అధికారులతో మాట్లాడారు. అనంతరం భూములను పరిశీలించారు. నష్టపోయిన భూముల విలువ ఎక్కువగా ఉన్నందున పరిహారం కూడా ఆ మేరకు చెల్లించాలని రైతులు జేసీకి విన్నవించారు. కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీవో ఎం.శేషిరెడ్డి, తహసీల్దార్‌ వి.కిరణ్‌, ఆర్‌ఐ విజయభాస్కర్‌, సర్వేయర్‌ గురవయ్య ఉన్నారు.

రైల్వే లైన్‌కు స్థల  పరిశీలన

కంభం : రైల్వే 2వ లైన్‌ నిర్మాణ విస్తరణ లో భాగంగా శనివారం  జాయింట్‌ కలెక్టర్‌ మురళి కంభంలోని భూములను పరిశీలించారు. ప్రభుత్వ సర్వేయర్‌, ఇతర రెవిన్యూ అధికారులతో భూములను పరిశీలించి వాటి  వివరాలతోపాటు అధికారులకు తగు సూచనలు చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ వెంట త హసీల్దార్‌ రామ్మోహన్‌రావు, డిటి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-02T06:11:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising