ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలి

ABN, First Publish Date - 2021-12-31T04:50:23+05:30

టెండర్ల ప్రక్రి య వేగవంతం చేసి రోడ్ల మరమ్మతు ప నులు వెంటనే చేపట్టేలా చర్యలు చేపట్టాలని సీఎం కార్యాలయం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అన్నారు. అద్దంకి పట్టణ సమీపంలో గుండ్లకమ్మనదిపై మరమ్మతులకు గురైన బ్రిడ్జి , అద్దంకి-దర్శి రోడ్డులను గురువారం ప్రవీణ్‌ప్రకాష్‌ పరిశీలించారు.

డాక్టర్‌తో మాట్లాడుతున్న ప్రవీణ్‌ప్రకాష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం కార్యాలయం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌


అద్దంకి, డిసెంబరు30: టెండర్ల ప్రక్రి య వేగవంతం చేసి రోడ్ల మరమ్మతు ప నులు వెంటనే చేపట్టేలా చర్యలు చేపట్టాలని సీఎం కార్యాలయం ప్రధాన కార్యదర్శి  ప్రవీణ్‌ ప్రకాష్‌ అన్నారు. అద్దంకి పట్టణ సమీపంలో గుండ్లకమ్మనదిపై మరమ్మతులకు గురైన బ్రిడ్జి , అద్దంకి-దర్శి రోడ్డులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతుల గురించి జిల్లా అధికారులతో మాట్లాడారు. 48 రోడ్ల మరమ్మతు పనులకు రూ. 59.3 కోట్లతో టెండర్లు పిలవగా 4పనులకు మాత్రమే టెండర్లు పూర్తయ్యాయని, మిగిలిన పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో రెండో విడత టెండర్‌ పిలిచామని, జనవరి 3వ తేదీ టెండర్ల దాఖలుకు అవకాశం ఉందని ఆర్‌అండ్‌బీ ఈఈ గోపీనాయక్‌ వివరించారు.  ఆయన వెంట కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ గోపినాయక్‌, తహసీల్దార్‌ ప్రభాకరరావు, నగరపంచాయతీ కమిషన ర్‌ ఫజులుల్లా, ఎంపీడీవో రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

డాక్టర్‌పై అసహనం  


మేదరమెట్ల : కొరిశపాడులో అమూల్‌ పాలకేంద్రం, మేదరమెట్లలో నిర్మాణంలో ఉన్న పీహెచ్‌సీ భవనాన్ని సీఎం కార్యాలయ స్పెషల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ గురువారం పరిశీలించారు. కొరిశపాడులో అమూల్‌ పాల కేంద్రాన్ని పరిశీలించి పాడి రైతులతో మాట్లాడారు.  అనంతరం మేదరమెట్ల పీహెచ్‌సీలో కరోనా  వ్యాక్సిన్‌  గు రించి డాక్టర్‌ వెంకటసుబ్బయ్యతో  మాట్లా డారు. దానికి సంబంధించి సరైన సమాధానం రాకపోవటంతో డాక్టర్‌పై అసహ నం వ్యక్తం చేశారు. కొత్త భవనం అసంపూర్తిగా ఉండటానికి కారణాలు అడిగి తె లుసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన ని ర్మాణానికి సంబంఽధించి బిల్లులు రాలేదని ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్‌ ఆ యన దృష్టికి తీసుకు పోయారు. జనవరి 10 నాటికి బిల్లులు ఇప్పిస్తాను...ఉగాది  నాటికి పనులు పూర్తి చేస్తారా అని ఆయ న అడిగారు. బిల్లుల గురించి తనకు గు ర్తు చేయాలని కలెక్టర్‌కు చెప్పారు. పెం డింగ్‌ బిల్లులు చెల్లిస్తే ఉగాది నాటికి పను లు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామని కాంట్రాక్టర్‌ తెలిపారు.


Updated Date - 2021-12-31T04:50:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising