ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్ల ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్‌ పూర్తి

ABN, First Publish Date - 2021-11-01T05:26:57+05:30

జిల్లాలో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతు ల కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా ముగి సింది.

పదోన్నతి పొందిన టీచర్‌ను సన్మానిస్తున్న విజయభాస్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలువిద్య, అక్టోబరు 31: జిల్లాలో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతు ల కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా ముగి సింది. చివరి రోజైన ఆదివారం స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్‌ హైస్కూలు లో ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపోధ్యాలయ ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్‌ను డీఈవో బి.విజయభాస్కర్‌ నిర్వహించారు. మొ త్తం 52  పోస్టులను ప్రకటించగా 33 మంది స్థానాలు కోరుకున్నారు. ఒక పోస్టును క్యారీ ఫార్వర్డ్‌గా  పరిగణిం చగా, ఆరుగురు గైర్హాజరయ్యారు. 12 మంది తమకు ప్రస్తుతం ప్రయోషన్‌ వద్దని తెలియజేశా రు. వీరి సర్వీసు రిజిస్టర్లలో నిరాకరణ పత్రాన్ని నమోదు చేసినట్లు డీఈవో తెలిపారు. కౌన్సెలింగ్‌కు గైర్హాజరైన వారికి పోస్టు ద్వారా నియామక ఉత్త ర్వులు పంపుతామన్నారు. ఉద్యోగోన్నతి పొందిన వారు పదిహేను రోజులోపు  కొత్త స్థానాల్లో చేరాలని ఆయన ఆదేశించారు. 

ఈ సందర్భంగా   ఉద్యోగోన్నతి పొందిన రోజే ఉద్యోగ విరమణ చేస్తున్న చీమకుర్తి మండలం కూ నం వారిపల్లి ఎంపీపీ స్కూలు ప్రధానోపాధ్యా యురాలు నాదెండ్ల దేవప్రసన్న కుమారిని విజయభాస్కర్‌ సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంటు డైరెక్టర్లు, బి.అంజరెడ్డి, డి.శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంఈవో టి.కిషోర్‌బాబు, డీసీఈబీ కార్యదర్శి వెంకారెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-01T05:26:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising