ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి

ABN, First Publish Date - 2021-12-19T06:04:59+05:30

ట్రాక్టర్‌ బోల్తాపడి మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లించి ఆదుకోవాలని మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిలు సైదా, మెడబలిమి వెంకటేశ్వరరావు, పుట్లూరి కొండారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని కంభాలపాడు సమీపంలో బెల్లంకొండ విద్యార్థులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటన తెలిసిందే. ఈ

విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సైదా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.50లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌  

పొదిలి రూరల్‌, డిసెంబరు 18 : ట్రాక్టర్‌ బోల్తాపడి మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లించి ఆదుకోవాలని మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిలు సైదా, మెడబలిమి వెంకటేశ్వరరావు, పుట్లూరి కొండారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని కంభాలపాడు సమీపంలో బెల్లంకొండ విద్యార్థులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థిని కోటేశ్వరి మృతదేహాన్ని శనివారం సందర్శించి నివాళులర్పించారు. కళాశాల సొంత పనులను విద్యార్థులతో చేయించడం సరికాదన్నారు. ఈ దుర్ఘటనటలో 15 మంది వరకూ గాయపడడంతోపాటు ఒకరు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు పూర్తి బాధ్యత కళాశాల యాజమాన్యం వహించాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాని రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియాను తక్షణమే చెల్లించాలన్నారు. తీవ్ర గాయాలతో ఒంగోలు చికిత్స పొందుతున్న విద్యార్థులకు ఒకొక్కరికీ రూ.10 లక్షలు, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. 

యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎ్‌ఫఐ

నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, అందుకు బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి  సీహెచ్‌.వినోద్‌ డిమాండ్‌ చేశారు. ఘటనలో మృతి చెందిన విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని కాలేజీ యాజమాన్యంతోపాటు, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.   ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు కోలుకునే వరకూ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఆయనవెంట జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌ ఉన్నారు.

 

Updated Date - 2021-12-19T06:04:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising