ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్‌ ఇక రూ.2500

ABN, First Publish Date - 2021-12-31T05:45:02+05:30

రాష్ట్రప్రభుత్వం వచ్చే జనవరి నుంచి ఎనిమిది రకాల పింఛన్లను రూ.2500 వంతున లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. ఇప్పటివరకు రూ.2,250 అందుకునే పింఛన్‌దారులు వచ్చే జనవరి నుంచి ప్రతినెలా ఇక రూ.2,500లు అందుకోనున్నారు. జిల్లాలో మొత్తం 4.25లక్షల పింఛన్లు ఉండగా ఇందులో 3,72,105 మందికి వచ్చేనెల నుంచి రూ.250 అదనంగా పెంచి ఇవ్వనున్నారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, మత్స్యకారులు, గీతకార్మికులు, చర్మకారులకు, హెచ్‌ఐవీ బాధితులకు జనవరి నుంచి పెంచిన పింఛన్లను అందజేయనున్నారు. ఇప్పటి వరకు ఉన్న 4.25లక్షల పింఛన్లకు ప్రతి నెలా రూ.99 కోట్లు పంపిణీ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనవరి నుంచి ఎనిమిది రకాల పింఛన్లు పెంపు

జిల్లాలో 3.72లక్షల మందికి ప్రయోజనం

జిల్లాకు 9వేల కొత్త పింఛన్లు మంజూరు

ఒంగోలు నగరం, డిసెంబరు 30: రాష్ట్రప్రభుత్వం వచ్చే జనవరి నుంచి ఎనిమిది రకాల పింఛన్లను రూ.2500 వంతున లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. ఇప్పటివరకు రూ.2,250 అందుకునే పింఛన్‌దారులు వచ్చే జనవరి నుంచి ప్రతినెలా ఇక రూ.2,500లు అందుకోనున్నారు. జిల్లాలో మొత్తం 4.25లక్షల పింఛన్లు ఉండగా ఇందులో 3,72,105 మందికి వచ్చేనెల నుంచి రూ.250 అదనంగా పెంచి ఇవ్వనున్నారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, మత్స్యకారులు, గీతకార్మికులు, చర్మకారులకు, హెచ్‌ఐవీ బాధితులకు జనవరి నుంచి పెంచిన పింఛన్లను అందజేయనున్నారు. ఇప్పటి వరకు ఉన్న 4.25లక్షల పింఛన్లకు ప్రతి నెలా రూ.99 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఇక నుంచి రూ.110కోట్ల దాకా పింఛన్లకు పంపిణీ చేయనున్నారు. అలాగే జిల్లాకు కొత్తగా 9,490 కొత్త పింఛన్లను మంజూరుచేసింది. ఈ పింఛన్లను కూడా జనవరి నుంచే లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. కొత్తగా మంజూరైన పింఛన్లను కలుపుకొని జిల్లాలో మొత్తం 4.33లక్షలకు పెరగనున్నాయి. డిసెంబర్‌ మాసానికి సంబంధించిన పింఛన్‌ మొత్తాన్ని రూ.2500లకు పెంచి జనవరిలో పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. పెంచిన పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని జనవరి ఒకటిన అమరావతి నుంచి సీఎం ప్రారంభించనున్నారు. జిల్లాలోనూ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-12-31T05:45:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising