ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీ దిగ్బంధంలో సక్కు కార్పొరేట్‌ ఆఫీసు

ABN, First Publish Date - 2021-12-08T08:46:06+05:30

ఐటీ దిగ్బంధంలో సక్కు కార్పొరేట్‌ ఆఫీసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

75 మంది ఐటీ సిబ్బంది ఏకకాలంలో సోదాలు

వ్యాపార వర్గాల్లో కలకలం.. సమాచార గోప్యత

గుంటూరు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): గుంటూరులోని ప్రముఖ పౌల్ర్టీ సంస్థ.. సక్కు కార్పొరేట్‌ కార్యాలయాన్ని మంగళవారం ఉదయం నుంచే ఐటీ బృందాలు దిగ్బంధించాయి. ఇక్కడి లక్ష్మీపురం మెయిన్‌ రోడ్డుపై ఈ కార్యాలయం ఉండగా, స్థానిక పోలీసుల సహకారంతో ట్రాఫిక్‌ను కాసేపు నియంత్రించాయి. అనంతరం సక్కు ఆఫీసు మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు ప్రారంభించాయి. ఉద్యోగులు సహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. 75 మంది ఐటీ అధికారులు/ఉద్యోగులు ఏకకాలంలో ఒక కార్పొరేట్‌ ఆఫీసులో సోదాలకు దిగడం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. సంవత్సరాంతం కావడంతో టార్గెట్లను అధిగమించేందుకు ఈ సోదాలు చేపట్టినట్లుగా భావిస్తున్నారు. సోదాల్లో లభించిన సక్కు గ్రూపు ఆఫ్‌ కంపెనీ్‌సకి సంబంధించిన డాక్యుమెంట్లు, ల్యాప్‌టా్‌పలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నారు.  రాత్రి 8 గంటల సమయానికి కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సక్కు గ్రూపునకు పౌలీ్ట్ర, పత్తి వ్యాపార సంస్థల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేసినట్లు తెలిసింది. సోదాల్లో ఏమేమి స్వాధీనం చేసుకొన్నామన్న విషయాన్ని ఐటీ అధికారులు గోప్యంగా ఉంచారు. 

Updated Date - 2021-12-08T08:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising