ఎస్సై కొట్టాడని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2021-05-26T03:26:57+05:30
మైలవరంలో ఎస్సై కొట్టాడని యువకుడు ఉప్పుతల శివ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కృష్ణా: మైలవరంలో ఎస్సై కొట్టాడని యువకుడు ఉప్పుతల శివ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టిన కేసు ఒప్పుకోమని ఎస్ఐ రాంబాబు తీవ్రంగా కొట్టారని శివ ఆరోపించారు. మళ్లీ ఎస్ఐ కొడతారనే భయంతోనే ఎలుకల మందు తాగానని శివ చెప్పారు. ఎలుకల మందు తాగడంతో శివ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం శివ మైలవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆస్పత్రిలో ఏఎస్సై తెల్లకాగితంపై సంతకం పెట్టించుకెళ్లారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తమకు న్యాయం చేయాలని ఎస్పీకి శివ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2021-05-26T03:26:57+05:30 IST