ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి

ABN, First Publish Date - 2021-03-23T05:18:18+05:30

హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి పిలుపునిచ్చారు.

అభిషేకం చేస్తున్న స్వాత్మానందేంద్ర సరస్వతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూరు, మార్చి 22: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి పిలుపునిచ్చారు. ధర్మ ప్రచార యాత్రలో భాగంగా సోమవారం ఆయన మండలంలో పర్యటించారు. కొత్తూరు రామాలయంలో ప్రత్యేక పూ జలు చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఫ రాజాం రూరల్‌: హిందూ ధర్మం ఎంతో గొప్పదని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా సోమవారం సూర్య దుర్గ కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయాలను కాపాడుకోవాలన్నారు. శారదాస్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరులకు అర్చన చేశారు. అనంతరం అంతకాపల్లి సమీపంలోని బాలా జీ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి స్వామిని కలిసి జిల్లాలో దేవాలయాల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలు, ఆలయ కమిటీలు, గ్రామ యువతతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను స్వామి ఆశీర్వదించారు.

Updated Date - 2021-03-23T05:18:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising