ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా పోలీస్‌ శాఖకుఅరుదైన గౌరవం

ABN, First Publish Date - 2021-02-06T05:24:49+05:30

అధికారులకు అరు దైన గౌరవం దక్కింది. కాశీబుగ్గ ఎస్‌ఐ-2 కొత్తూరు శిరీష, ఎచ్చెర్ల ఎస్‌ఐ రాజేష్‌లు విధి నిర్వ హణలో చూపిన తెగువ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




 ఎస్‌ఐలు శిరీష, రాజేష్‌లకు డీజీపీ పురస్కారాలు
పలాస/ఎచ్చెర్ల, ఫిబ్రవరి 5 :
జిల్లా పోలీస్‌ శాఖకు చెందిన ఇద్దరు అధికారులకు అరు దైన గౌరవం దక్కింది. కాశీబుగ్గ ఎస్‌ఐ-2 కొత్తూరు శిరీష, ఎచ్చెర్ల ఎస్‌ఐ రాజేష్‌లు విధి నిర్వ హణలో చూపిన తెగువకుగాను పురస్కారాలు లభించాయి. విజయవాడలోని రాష్ట్ర పోలీస్‌ శాఖ కార్యాలయంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చేతులమీదుగా ప్రశంసాపత్రంతో పాటు గోల్డ్‌ మెడల్‌ను అందుకున్నారు. కాశీబుగ్గ ఎస్‌ఐ శిరీష ఇటీవల ఓ అనాథ వృద్ధుడి మృతదేహాన్ని కిలోమీటరు మేర పొలం గట్లపై మోసి అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆమె తెగువను గుర్తించిన డీజీపీ అభినందిస్తూ పురస్కారాన్ని అందించారు. సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్‌లో శిరీషకు అభినందనలు తెలిపారు. అలాగే 2018 డిసెంబరు 12న మెళియాపుట్టి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించే సమ యంలో ఎస్‌ఐ రాజేష్‌ ఒడిశా పోలీసులు ముగ్గుర్ని కాపాడారు. మహేంద్రతనయా నది వం తెన వద్ద చిక్కుకున్నారు. రాత్రంతా వారికి ధైర్యం చెబుతూ..ఉదయం నడుముకు తాడుకట్టి వారిని కాపాడారు. రాజేష్‌ ధైర్య సాహసాలను గుర్తించిన పోలీస్‌ శాఖ 2019 సంవత్సరానికి గాను జీవన రక్షా పతకాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఇద్దరు ఎస్‌ఐలకూ జిల్లా పోలీస్‌ అధికారులు అభినందనలు తెలిపారు.



Updated Date - 2021-02-06T05:24:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising