పోరాటం ఆగదు.. ఎంతకైనా తెగిస్తాం: పల్లా శ్రీనివాస్
ABN, First Publish Date - 2021-03-09T03:04:41+05:30
పోరాటం ఆగదు.. ఎంతకైనా తెగిస్తాం: పల్లా శ్రీనివాస్
విశాఖ: స్టీల్ ప్లాంట్‌పై ప్రైవేటీకరణ 100 శాతం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తన పోరాటం ఆగదని, ఎంతకైనా తెగిస్తామని టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉద్యమానికి ఊతం ఇచ్చామన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆపామని చెప్పారు. ఇప్పుడు ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. విశాఖలో పాదయాత్రలు చేయడం కాదని, ఢిల్లీ వెళ్లి కేంద్ర మీద ఒత్తిడి తేవాలని సూచించారు. ప్రభుత్వం ముందు ఉంటే వెనక నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2021-03-09T03:04:41+05:30 IST