టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టు
ABN, First Publish Date - 2021-01-04T07:58:45+05:30
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కడప జిల్లా పోలీసులు ఆదివారం సాయంత్రం చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
- చెన్నై విమానాశ్రయంలో నిర్బంధం..
- 2018నాటి ఘర్షణ కేసు వెలికితీత
- నేడు పులివెందుల కోర్టులో హాజరు?
చెన్నై/కడప, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కడప జిల్లా పోలీసులు ఆదివారం సాయంత్రం చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బెంగుళూరు నుంచి వచ్చిన ఆయన్ను ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించిన పోలీసులు.. ప్రత్యేక వాహనంలో కడపకు తీసుకెళ్లారు. 2018 మార్చి 4న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కేసును పోలీసులు తాజాగా వెలికితీశారు. సోమవారం ఆయనను పులివెందుల కోర్టులో హాజరుపరిచే అవకాశముంది. కాగా.. చట్టప్రకారమే చెన్నై ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్సీ బీటెక్ రవిని అరెస్టు చేశామని కడప ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అయితే ఈ అరెస్టు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, 2018లో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారని, ఇంతకాలం వారు ఏంచేశారని బీటెక్ రవి చెన్నైలో విలేకరులతో అన్నారు. ‘జగన్ పాలనలో కంటే జైలులోనైనా మేం ప్రశాంతంగా ఉండగలం. ఎన్నికల వరకు మమ్మల్ని కస్టడీలో ఉంచినా భయం లేదు. ఎన్నిసార్లయినా జైలుకెళ్లడానికి సిద్ధమే’ అని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
అరెస్టును ఖండించిన చంద్రబాబు, లోకేశ్
అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి లోకేశ్ ఖండించారు. ‘‘అంతర్జాతీయ దొంగలకు బెయిల్ ఇచ్చి రోడ్ల మీద తిప్పుతున్నారు. ప్రజాపోరాటం చేసిన వారిపై కేసులు పెట్టి జైల్లో పెడతారా? రాష్ట్రంలో గూండాగిరి రాజ్యమేలుతోంది.’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘
Updated Date - 2021-01-04T07:58:45+05:30 IST