ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థతతో రాష్ట్రం ఎడారి: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2021-06-22T08:34:34+05:30

కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాబోయే రోజుల్లో రాష్ట్రం ఎడారిగా మారుతుందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, జూన్‌ 21: కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాబోయే రోజుల్లో రాష్ట్రం ఎడారిగా మారుతుందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చే శారు. రోమ్‌ నగరం తగలబడి పోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయిస్తూ కూ ర్చున్నట్టు.. బీజేపీ, వైసీపీ ప్రభుత్వాల వైఖరి ఉందన్నారు. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో 84, 85, 86, 87 సెక్షన్ల ప్రకారం కృష్ణా, గోదావరి నదులపై పూర్తి హక్కు, బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. చట్టంలోని 87 సెక్షన్‌ ప్రకారం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యాల పరిధిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాలన్నారు. ఏడేళ్లైనా ఆ పని చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయకుండా ఉండిపోవడం శోచనీయమన్నారు. 

Updated Date - 2021-06-22T08:34:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising