ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రవర్ణాలకూ ‘చేయూత’

ABN, First Publish Date - 2021-02-24T07:59:42+05:30

రాష్ట్రంలో ‘వైఎస్‌ జగన్‌ చేయూత’ కింద కాపు మహిళలకు అందిస్తున్న తరహాలోనే అగ్రవర్ణాల మహిళలకూ ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న మూడేళ్లు ‘జగనన్న ఈడబ్ల్యూఎస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

45-60 ఏళ్ల పేద మహిళలకు రూ.15,000

కాపులకు ఇస్తున్నట్టే ఆర్థిక సాయం 

మూడేళ్లలో ఒక్కో మహిళకు 45,000 

వచ్చే జనవరి దాకా నవరత్నాల కేలండర్‌

విశాఖ ఉక్కుపై అసెంబ్లీలో తీర్మానం

100 రోజుల్లో ఏసీబీ కేసులు క్లియర్‌

అవినీతి కట్టడి కోసం చట్ట సవరణ

కాకినాడ సెజ్‌ భూములు వెనక్కి

దివీస్‌ వ్యర్థాల నిర్వహణకు ప్లాంటు

రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు

అమరావతి రుణానికి గ్యారంటీ

రూ.3 వేల కోట్ల ప్రతిపాదనలపై కేబినెట్‌ నిర్ణయం

పాలనా రాజధానిగా విశాఖకు.. అమరావతినీ అభివృద్ధి చేస్తాం: మంత్రి


అమరావతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ‘వైఎస్‌ జగన్‌ చేయూత’ కింద కాపు మహిళలకు అందిస్తున్న తరహాలోనే అగ్రవర్ణాల మహిళలకూ ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న మూడేళ్లు ‘జగనన్న ఈడబ్ల్యూఎస్‌ చేయూత’ కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి రూ.15,000 చొప్పున చెల్లించాలని తీర్మానించింది. ఇలా వచ్చే మూడేళ్లలో ఒక్కొక్కరికీ రూ.45,000 చెల్లించేలా ఏటా రూ.670కోట్లు కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న నవరత్నాలు కార్యక్రమం 2021-22 కేలండర్‌ను కేబినెట్‌ ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో 300 చదరపు అడుగులలోపు ఉంటే రూపాయికే లబ్ధిదారులకు అందించేందుకు ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.  ఈ సమావేశం ప్రారంభంలో, పంచాయతీ ఎన్నికల్లో 80శాతంమంది వైసీపీ మద్దతుదారులు విజయం సాధించినందుకు మంత్రులకు ముఖ్యమంత్రి  అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు  ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. భవిష్యత్తులో జరిగే పరిషత్‌ ఎన్నికల్లోనూ ఇదే విజయాన్ని సొంతం చేసుకుందామని మంత్రులకు కర్తవ్యబోధ చేశారు. రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగాన్ని పెంచాల్సి ఉందని .. లేదంటే .. కరోనా తీవ్రత పెరిగే అవకాశం ఉందని సీఎం జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేబినెట్‌ సమావేశం నిర్ణయాలను సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య మీడియాకు వెళ్లడించారు. ఆ వివరాలు


అసెంబ్లీలో ‘విశాఖ’.. అమరావతికి నిధుల గ్యారంటీ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయాలి. మార్చి 15వ తేదీతో మునిసిపల్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత శాసనసభా బడ్జెట్‌ సమావేశాన్ని నిర్వహించాలి. అమరావతి ట్రంక్‌ ఇన్‌ఫ్రా కింద రోడ్లు, ఎల్‌పీఎస్‌ పనులకు సంబంధించి రూ. 3000 కోట్ల నిధుల ప్రభుత్వ గ్యారంటీ ప్రతిపాదనలకు ఆమోదం.


కేటాయింపులు.. వెనక్కి..

2021 ఏప్రిల్‌నుంచి కొత్తగా వచ్చే ప్రైవేటు లేఅవుట్‌లలో ఐదు శాతం భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయించాలి. కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దంట్లూరు, సున్నపురాళ్ల పల్లెలో 3148.68 ఎకరాలు ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌కు కేటాయింపు. ఇదే జిల్లా వల్లూరు మండలం అంబాపురంలో 93.99 ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మెగా ఇండస్ట్రియల్‌ పార్కు కోసం భూమి కేటాయింపు. సీకే దిన్నె మండలం ఒప్పర్తిలో 598.59 ఎకరాలను  మెగా ఇండిస్ట్రియల్‌ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి భూమి కేటాయింపు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఏపీ మారిటైమ్‌ బోర్డుకు అప్పగించిన 165.34 ఎకరాలకు ఆమోదం. టీటీడీ ఉద్యోగులకు ఇళ్లస్థలాలు కేటాయింపు. పేదవాళ్లలో అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న 1,43,600 మందికి 300 చ.అ. విస్తీర్ణంలో ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేయాలి. 365 చ.అ. ఫ్లాట్‌కు 25,000, 430 చదరపు అడుగుల ఫ్లాట్‌కు రూ.50,000 చెల్లిస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా గత ప్రభుత్వంలో చెల్లించి ఉంటే ఆ మొత్తం సదరు లబ్ధిదారులకు వెనక్కి ఇచ్చేయాలి. 


రైతులు..

రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా మల్టిపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు..


కొత్త నియామకాలు.. చట్టాలు

చిత్తూరు జిల్లా పెనుమూరు, కావేటిలో 50 పడకల ఆస్పత్రులుగా పీహెచ్‌సీల అప్‌గ్రేడ్‌. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డిగ్రీ కాలేజికి 24 మంది అధ్యాపక,  14 మంది అధ్యాపకేతర సిబ్బంది నియామకానికి ఆమోదం.  ఏపీ గేమింగ్‌ యాక్టు 1974 సవరణలకు అంగీకారం.


పెట్టుబడులు.. ప్లాంట్లు..

కడపలో వైఎ్‌సఆర్‌ స్టీల్‌ ప్లాంట్‌ను జాయింట్‌వెంచర్‌లో ఏర్పాటు చేసేందుకు ఆమోదం. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కేపిటల్‌ వెంచర్‌ పారదర్శకంగా జాయింట్‌ వెంచర్‌ సంస్థను ఎంపిక చేశాం. తొలిదశలో రూ.10,002 కోట్లు.. రెండో దశలో రూ.6,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు జాయింట్‌ వెంచర్‌  సంస్థ ముందుకొచ్చింది. తుని దివీస్‌ ల్యాబ్‌ సహాకాకినాడ సెజ్‌లో వ్యర్థ పదార్థాలు బయటకు రానివ్వకుండా ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటు. గుజరాత్‌ లోని సూరత్‌తో పోటీ పడేలా.. రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో చెత్త సేకరణ కోసం ఆరు నెలల్లోగా 2700 వాహనాల సమీకరణ.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం ఇకపై నిషేధం.


కాకినాడ సెజ్‌ భూములు వెనక్కి

రైతులపై కేసులు ఎత్తివేత.. కన్నబాబు నివేదిక

కాకినాడ సెజ్‌ దేశంలోనే పెద్దదని, 10వేల ఎకరాలను సేకరించి ఏర్పాటుచేశారని..ఆ సెజ్‌పై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు రైతులపై ఉక్కుపాదం మోపి భూములు తీసుకున్నాయన్నారు. సెజ్‌కు భూములు ఇచ్చి పరిహారం వద్దని తిరస్కరించిన రైతులకు చెందిన 2,180ఎకరాలు వెనక్కు ఇవ్వాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుందని మీడియాకు మంత్రి తెలిపారు. తాను కాకినాడ సెజ్‌పై కేబినెట్‌కు సమర్పించిన నివేదికలోని వివరాలను ఆయన వెల్లడించారు. ‘కాకినాడ సెజ్‌ పరిధిలోకి వచ్చే ఆరు గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించేందుకు రైతులపై గత ప్రభుత్వంలో వందలాది కేసులు పెట్టారు. వాటిని ఎత్తేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. స్థానికులకే 75శాతం ఉద్యోగాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని కాకినాడ సెజ్‌లో అమలుచేస్తాం. ఈ మేరకు అంగీకారం కుదిరింది. దివీస్‌ ల్యాబ్‌ నుంచి వెలువడే వ్యర్థాలను సముద్రంలోకి వదిలేయకుండా చూడాలని ఆదేశాలిచ్చాం. తద్వారా హేచరీలకు ఇబ్బంది ఉండద’ని మంత్రి కన్నబాబు తెలిపారు.


పథకాల కేలండర్‌..

  • నవరత్నాల కార్యక్రమం 2021-22 కేలండర్‌కు ఆమోదం. రైతు భరోసా కింద రెండేళ్లలో 3దఫాలుగా దాదాపు 54 లక్షల మందికి ఆర్థిక సహాయం అందించినట్లుగానే.. ఈ పథకాన్ని కొనసాగించాలి. 
  • మే.. ‘మత్స్య భరోసా’ కింద 19,000 పడవలపై ఆధారపడి జీవిస్తున్న దాదాపు 1,09,000 మందికి పైగా డీజిల్‌ సబ్సిడీ పథకం అమలు. 
  • జూన్‌.. ‘వైఎ్‌సఆర్‌ చేయూత’ కింద 34,55,000 మందికి లబ్ధి..
  • జూలై.. వైఎ్‌సఆర్‌ వాహన మిత్ర పథకం కింద దాదాపు 2,74,000 మందికి ఆర్థిక సాయం. కాపునేస్తం పథకంకింద 3,27,000 మహిళలకు సాయం
  • ఆగస్టు.. దాదాపు 25 లక్షల మంది రైతులకు వడ్డీ లేని రుణాలు.. ఇదే నెలలో 9000 పైచిలుకు ఎంఎస్‌ఎంఈలకు పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపు. నేతన్న నేస్తం కింద 81000 మంది పైచిలుకు చేనేత కార్మికులకు లబ్ధి . 3,34,000 మంది దాకా అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు జరపాలి.
  • సెప్టెంబరు...‘వైఎ్‌సఆర్‌ ఆసరా’ కింద దాదాపు 87 లక్షల మందికి సాయం.
  • అక్టోబరు.. దాదాపు 90,05,000 మందికి జగనన్న చేయూత. టైలర్లు, రజకులు, నాయీబ్రాహ్మణులకు ‘జగనన్న చేదోడు’ కింద లబ్ధి. 
  • నవంబరు... ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు రూ.15,000 ‘జగనన్న ఈడబ్ల్యూఎస్‌ చేయూత’. 
  • 2022 జనవరి... ‘అమ్మఒడి’ కింద 44 లక్షల పైచిలుకు తల్లులకు లబ్ధి. ఈ లెక్కన దాదాపు ఎనిమిది కోట్ల మందికిపైగా ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయి.


ఉద్యోగులు... వేటు

లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ప్రభుత్యోగులపై ఏసీబీ అభికారులు దశాబ్దాలు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవంపై ఆగ్రహం. 1991 నాటి కేసులు కూడా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఇలాంటివి 400 దాకా ఉన్నాయి. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అవినీతి ఉద్యోగులపై 100 రోజుల్లో చర్యలు తీసుకునేలా అవినీతి నిరోధక చట్టంలో సవరణలు చేయాలి.. దీనిని అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాలి. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి ప్రీతీ సుడాన్‌ 2005-06లో వ్యక్తిగత సెలవులు దుర్వినియోగం చేసినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2021-02-24T07:59:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising