ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎస్పీ నిజాయితీగా పనిచేయట్లేదు: వరదరాజులరెడ్డి

ABN, First Publish Date - 2021-08-31T21:41:52+05:30

ప్రొద్దుటూరు డీఎస్పీ నిజాయితీగా పని చేయట్లేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క‌డ‌ప: ప్రొద్దుటూరు డీఎస్పీ నిజాయితీగా పనిచేయట్లేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. మంగళవారం 9 ఏళ్ల బాలుడి హత్యకేసు మిస్టరీ, పోలీసుల తీరుపై వరదరాజులరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజుపాలెం మండలం వెంగ‌ళాయ‌ప‌ల్లెలో బాలుడి హ‌త్య కేసులో పోలీసుల విచార‌ణ స‌రిగా లేదన్నారు. పోలీసులు రాజ‌కీయ వ‌త్తిళ్ల‌కు, డ‌బ్బుకు త‌లొగ్గి కేసుకు స‌బంధం లేని ద‌స్త‌గిరిని అరెస్టు చేశారని వరదరాజులరెడ్డి మండిపడ్డారు.

ప్రొద్దుటూరులో పోలీసుల అవినీతి కార్య‌క‌లాపాలు ఎక్కువ‌య్యాయని ఆరోపించారు. అధికార పార్టీ నేత‌లు ఎలా చెబితే అలా పోలీసులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసు అధికారుల అవినీతిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. పోలీసులు ప్రొద్దుటూరులో దుర్మార్గంగా వ్య‌హ‌రిస్తున్నారని దుయ్యబట్టారు. వెంగ‌ళాయ‌ప‌ల్లె బాలుడు త‌నీష్ రెడ్డి హ‌త్య కేసులో అస‌లైన దోషులను ప‌ట్టుకోవాలని వరదరాజులరెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-08-31T21:41:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising