ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు ఉల్లంఘించి.. భారతి సిమెంట్స్‌కు సాయం

ABN, First Publish Date - 2021-12-31T07:21:38+05:30

నిబంధనలు ఉల్లంఘించి.. భారతి సిమెంట్స్‌కు సాయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలయాపనకే కృపానందం పిటిషన్‌

మైనింగ్‌ లీజు సూత్రధారి ఆయనే

తెలంగాణ హైకోర్టుకు సీబీఐ నివేదన


హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బి.కృపానందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు నిబంధనలను ఉల్లంఘించి వైఎస్‌ జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌కు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపించింది. శాఖాధిపతిగా చర్యలు తీసుకోవాల్సిన స్థాయిలో ఉన్నా, కృపానందమే చట్ట వ్యతిరేకంగా చేశారని సీబీఐ తరఫు న్యాయవాది సురేందర్‌ తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి.. భారతి సిమెంట్స్‌ వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కృపానందం దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం విచారణ జరిపింది. కృపానందాన్ని ప్రాసిక్యూట్‌ చేసేందుకు ప్రభుత్వ అనుమతులు అవసరం లేదని సురేందర్‌ తెలిపారు. సీబీఐ చార్జిసీటును సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించడం కాలయాపన చేసేందుకేనని తెలిపారు. మైనింగ్‌ లీజు కోసం గుజరాత్‌కు చెందిన అంబుజా సిమెంట్‌ చేసుకున్న దరఖాస్తులను కావాలని తిరస్కరించారని.. లీజు వ్యవహారంలో ఆయనే అసలు సూత్రధారి అని, వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. తదుపరి విచారణను హైకోర్టు జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.


Updated Date - 2021-12-31T07:21:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising