ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

280 మందికి వంటా.. వడ్డింపు ఇద్దరే..!

ABN, First Publish Date - 2021-03-22T06:09:26+05:30

కస్తూర్బా గాంధీ విద్యాలయాలు మంచి ఫలితాలు సాధిస్తున్నా.. కొన్ని చోట్ల అవసరమైన సౌకర్యాల కల్ప నలో అధి కారులు నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారు.

వాచ్‌ ఉమన్‌ సహకారంతో భోజనం వడ్డిస్తున్న కుక్‌, హెల్పర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

 గొలుగొండ కేజీబీవీలో ఒకే కుక్‌.. ఒక్కరే హెల్పర్‌

 ఒక్కోసారి నైట్‌ వాచ్‌ ఉమన్‌  సహకారం

 సకాలంలో టిఫిన్‌, భోజనాలు అందక సమయం వృథా

 అవస్థలు పడుతున్న విద్యార్థినులు  


గొలుగొండ, మార్చి 21 : కస్తూర్బా గాంధీ విద్యాలయాలు మంచి ఫలితాలు సాధిస్తున్నా.. కొన్ని చోట్ల అవసరమైన సౌకర్యాల కల్ప నలో అధి కారులు నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారు. ఫలితంగా సమ స్యలు బయటకు చెప్పలేక,  అలా గని వాటిని ఎదుర్కొంటూ విద్యా భ్యాసం సాగించ లేక విద్యార్థినుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటు న్నాయి. ఇందుకు గొలుగొండ పాఠ శాలను ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడి కస్తూర్బా గాంధీ పాఠశాల, కళాశాలలో 280 మంది వరకు విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న పాఠశాలలో రెండు వందల మంది ఉన్నారు. గత ఏడాది నుంచి కళాశాలగా ప్రభు త్వం అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో మరో 80 మంది విద్యార్థినులు వచ్చి చేరారు. ప్రస్తుతం ఇక్కడ మొత్తం 280 ఉండగా, వీరందరికీ వంటలు వండేది, వడ్డించేది ఇద్దరే కావడం ఆశ్చర్యకరం. విద్యార్థినుల సంఖ్య బాగానే ఉన్నప్పటికీ వీరికి అందు తున్న సౌకర్యా లపైనే పలువురు పెదవి విరుస్తున్నారు.కొవిడ్‌ అనంతరం రెండు నెలల క్రితం ఈ పాఠశాల, కళాశాల పునఃప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి విద్యార్థినులకు ఒక కుక్‌, ఒక హెల్పర్‌ మాత్రమే వంట వండుతుం డడం, వడ్డిస్తుండడం చేస్తున్నారు. ఒక్కోసారి అక్కడ పనిచేసే నైట్‌ వాచ్‌ ఉమన్‌ వీరికి సహాయప డుతుంటారు. దీంతో వేళకు భోజ నాలు వడ్డించే అవకాశం లేకపో తోంది. ఇద్దరు ఇంతమందికి వండి వడ్డించాలంటే ఎంత కష్టమో.. తెలి సినా కూడా అధికారులు ప్రత్యా మ్నాయ చర్యలు చేపట్టకపోవడం తగదని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. అసలే ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ఆరం భమైంది. మరోపక్క పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్న వేళ టిఫిన్‌ భోజనాల కోసం చాలా సమయం పళ్లాలు పట్టుకుని నిల్చోవలసి వస్తుందని, దీని వల్ల విలువైన సమయం వృథా అవుతుందని విద్యార్థినులు మదన పడుతున్నారు. సమయానికి భోజ నం అందే విధంగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ సమస్యను కేజీ బీవీ ఇన్‌చార్జి ప్రత్యేకాధికారి అరుణకుమారి వద్ద ప్రస్తావించగా, ప్రస్తు తం ఇద్దరు మాత్రమే వంట నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సకాలంలో భోజనం అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.  


Updated Date - 2021-03-22T06:09:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising