పినజాగేరులో 30 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం
ABN, First Publish Date - 2021-11-03T05:28:23+05:30
ఏజెన్సీలోని పలు గ్రామాల్లో మంగళవారం గంజాయి తోటలను ధ్వంసం చేశారు. మండలంలోని పినజాగేరు గ్రామస్థులు మంగళవారం 30 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు.
జి.మాడుగుల, నవంబరు 2: ఏజెన్సీలోని పలు గ్రామాల్లో మంగళవారం గంజాయి తోటలను ధ్వంసం చేశారు. మండలంలోని పినజాగేరు గ్రామస్థులు మంగళవారం 30 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. మండలంలోని నుర్మతి పంచాయతీ పినజాగేరు గ్రామస్థులం తా తమ గ్రామానికి చెడ్డపేరు రాకూడదన్న సంకల్పంతో సర్పంచ్ తల్లే సూరిబాబు ఆధ్వర్యంలో గ్రామ పరిసరాల్లో 30 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ శ్రీనివాసరావు వారిని అభినందించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్, వలంటీర్, గ్రామపెద్దలు, యువకులు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-03T05:28:23+05:30 IST