ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజనల్‌ వ్యాధులపై అవగాహనకు స్పెషల్‌ డ్రైవ్‌

ABN, First Publish Date - 2021-08-28T04:17:36+05:30

పరిసరాల పరిశుభ్రతతోనే మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా నియంత్రించడం సాధ్యమని 8వ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ చక్రవర్తి అన్నారు.

బంక్‌ కూడలిలో నిర్వహించిన మానవహారం కార్యక్రమంలో పాల్గొన్న జడ్సీ చక్రవర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపాలపట్నం, ఆగస్టు 27: పరిసరాల పరిశుభ్రతతోనే మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా నియంత్రించడం సాధ్యమని 8వ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ చక్రవర్తి అన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి జోన్‌ పరిధిలో శుక్రవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బంక్‌ కూడలిలో ప్రజారోగ్య విభాగం సిబ్బంది, ఆశ వర్కర్లు, వైద్య బృందం సిబ్బంది మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్సీ చక్రవర్తి మాట్లాడుతూ దోమలు వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ ప్రజారోగ్య విభాగం సిబ్బంది సూచనలను పాటించాలని కోరారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే 89వ వార్డులో నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో వైసీపీ వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఏఆర్‌ నగర్‌, నాగేంద్రకాలనీ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. 91, 92 వార్డుల పరిధిలోని లక్ష్మీనగర్‌, ఇందిరానగర్‌ ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీల్లో జీవీఎంసీ కో ఆప్షన్‌ మెంబర్‌ బెహరా భాస్కరరావు పాల్గొని సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. 

Updated Date - 2021-08-28T04:17:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising