ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-01-13T05:50:49+05:30

సంక్రాంతి పండుగ పేరిట అసాంఘిక చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని పాడేరు సీఐ పీపీ.నాయుడు హెచ్చరించారు.

పాడేరు సీఐ పీపీ.నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



పాడేరు సీఐ పీపీ.నాయుడు హెచ్చరిక 

పాడేరు, ముంచంగిపుట్టు, హుకుంపేట, పెదబయలు జనవరి 12: సంక్రాంతి పండుగ పేరిట అసాంఘిక చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని పాడేరు సీఐ పీపీ.నాయుడు హెచ్చరించారు. పండుగ సందడి పేరిట కోడి పందాలు, జూదాలు వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ వద్దన్నారు. పోలీసుల కళ్లు గప్పి అసాంఘిక చర్యలకు పాల్పడాలనే చూస్తే చట్టపరంగా ఇబ్బందులు పడతారన్నారు. మండల కేంద్రాల్లోని తహసీల్దార్‌, ఎస్‌ఐ తదితరులతో ‘సమిష్టి తనిఖీ జట్టు’, గ్రామాల్లోని వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులతో ‘గ్రామ పర్యవేక్షణ కమిటీ’లను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా ఎటువంటి అసాంఘిక చర్యలు జరుగుతున్నట్టు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇదే అంశాలపై పోలీస్‌, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసేందుకు మంగళవారం సీఐ పీపీ.నాయుడు హుకుంపేట, ముంచంగిపుట్టు మండలాలను సందర్శించారు. ఈ కార్యక్రమాల్లో ఎస్‌ఐలు షేక్‌.నజీర్‌, పి.ప్రసాదరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-13T05:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising