ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి వడ్డాది వెంకన్న కల్యాణోత్సవాలు

ABN, First Publish Date - 2021-03-22T05:46:09+05:30

మండలంలోని వడ్డాది గిరిజాంబగిరిపై వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

గిరిజాంబగిరిపై వేంకటేశ్వరస్వామి, వడ్డాది వేంకటేశ్వర దేవాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చెయ్యపేట, మార్చి 21: మండలంలోని వడ్డాది గిరిజాంబగిరిపై వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 23న రాత్రి 10 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణ, 24న స్వామికి సహస్రనామ, అష్టోత్తర నామాలతో పూజలు, హోమాదికాలు, గజ, గరుడ వాహనాలపై తిరువీథి ఉత్సవం, అనంతరం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 25న ప్రత్యేక పూజలు, 26న హోమాదికాలు, సదస్యం, 27న ప్రత్యేక పూజలు, 28నపూర్ణాహుతి, నాగవల్లి వసంతోత్సవం, తిరువీథి ఉత్సవం,  చక్రస్నానం, 29న సోమవారం పుష్పాగోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేవాలయంతో పాటు స్థానిక జంక్షన్‌లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు వ్యవస్థాపక ధర్మకర్త దొండా కన్నబాబు, ఈఓ కీర్తి ఆదినారాయణరావు తెలిపారు. 


బాలచెంచమ్మ ఉత్సవానికి  ఏర్పాట్లు

రావికమతం, మార్చి 21:  మండలంలోని గర్నికం బాలచెంచమ్మ  తీర్థమహోత్సవం ఈనెల 24న నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.  ఏటా నిర్వహించే మహోత్సవానికి బంధువులు, స్నేహితులతో పాటు ఉత్తరాంధ్ర నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఉత్సవానికి లక్షమందికి పైగా హాజరవుతారని భావిస్తున్న ఉత్సవ కమిటీ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తోంది.  


Updated Date - 2021-03-22T05:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising