ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాది పాటు కరోనా పరిహారం చెల్లించాలి

ABN, First Publish Date - 2021-06-22T05:40:18+05:30

కరోనా మహమ్మారి దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రజలను రక్షించేందుకు ఏడాది పాటు కరో నా పరిహారం చెల్లించాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం / బెలగాం, జూన్‌ 21 : కరోనా మహమ్మారి దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రజలను రక్షించేందుకు ఏడాది పాటు కరో నా పరిహారం చెల్లించాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. సోమవారం పార్వతీపురం వచ్చిన ఆయన ముందుగా కరోనా వ్యాధితో మృతి చెందిన సీపీఎం పార్వతీపురం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరా మ్మూర్తి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన సుందరయ్య భవనంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సీపీఎం పార్టీ బలపడిందంటే శ్రీరామ్మూర్తి కృషే కారణమన్నారు. శ్రీరామ్మూర్తి ఒక వ్యక్తి కాదని శక్తిలా నిలిచి పార్టీని ముందుకు నడిపించారన్నారు. యూటీఎఫ్‌ నాయకులు శేషగిరి మృతి ఉపాధ్యాయ లోకానికి తీరని లోటన్నారు. ఇటువంటి గొప్ప నాకులు కరోనా కాటుకు గురై మృతి చెందడం బాధాకరమన్నారు. మూడో దశ కరోనా వస్తుందని వైద్య నిపుణులు ఇప్పటికే ప్రకటి స్తున్నారని, ఇప్పటికే విజయనగరంలో రోగుల కోసం ఐసో లేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ఇక్కడ రోగులకు సీపీ ఎం వలంటీర్లు ఉచితంగా సేవలందిస్తారన్నారు. రోగులకు సేవలందించడానికి సీపీఎం కార్యకర్తలు, నాయకులు ధైర్యం గా ముందుకు రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆదాయం ఉండే విధంగా పరిపాలన చేయడం లేదని, ధరలు ఆకాశాన్నంటినా ధర ల స్థిరీకరణ లేదన్నారు. కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టడం సరి కాదని, ప్రజల సంక్షేమం కూడా ముఖ్యమని గుర్తు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.కృష్ణ మూర్తి, జిల్లా కార్యదర్శి టి.సూర్యనా రాయణ, జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు రెడ్డి వేణు, వి.ఇందిర, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-06-22T05:40:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising