ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బలహీనవర్గాలకు రక్షణ కరువు

ABN, First Publish Date - 2021-02-06T04:51:51+05:30

ప్రభుత్వంలో బడుగు, బలహీనవర్గాల వారికి రక్షణ లేకుండా పోతోందని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీకి వైసీపీ నాయకులు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పంచాయతీ ఎన్నిక

సమావేశంలో మాట్లాడుతున్న సాకే శైలాజానాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌
విజయనగరం రింగురోడ్డు, ఫిబ్రవరి 5:
వైసీపీ ప్రభుత్వంలో బడుగు, బలహీనవర్గాల వారికి రక్షణ లేకుండా పోతోందని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీకి వైసీపీ నాయకులు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.  పంచాయతీ ఎన్నికల్లో 20 శాతం అభ్యర్థులను నిలబెట్టామని  తెలిపారు. కేవలం బలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పోటీ చేస్తున్నట్టు చెప్పారు. బలవంతపు ఏకగ్రీవాలకు తమ పార్టీ దూరమని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందన్నారు. రాబోయే ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిపారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు సుంకరి సతీష్‌ ఉన్నారు.


Updated Date - 2021-02-06T04:51:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising