ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాపీమేస్ర్తీ ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-12-20T05:19:38+05:30

ఆర్థిక సమస్యలను భరించలేక ఆత్మహత్య చేసుకున్న తాపీమేస్ర్తీ ఉదంతమిది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఆర్థిక ఇబ్బందులే కారణం

బొబ్బిలిరూరల్‌, డిసెంబరు 19: ఆర్థిక సమస్యలను భరించలేక ఆత్మహత్య చేసుకున్న తాపీమేస్ర్తీ ఉదంతమిది. ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొబ్బి లి మండలం రాజుపేట గ్రామానికి చెందిన బంటు లక్ష్ము నాయుడు (38)  ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఈ నెల 11న గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడిని వెంటనే బొబ్బిలి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశాడు. లక్ష్మునాయుడుకు భార్య కుమారి, కుమారుడు మోహన్‌ కృష్ణ, కుమార్తె అనూరాధ ఉన్నారు. ఇంటిపై చిన్న గది కట్టుకున్న తరువాత కుమార్తెకు ఇటీవల వివాహం చేశాడు. రుణాలు ఎక్కువైపోవడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృత దేహాన్ని బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

 

Updated Date - 2021-12-20T05:19:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising