ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి

ABN, First Publish Date - 2021-06-22T05:43:11+05:30

కరోనా విజృంభిస్తున్న తరుణంలో యోగా చేసి ఆరోగ్యంగా జీవించాలని పార్వతీపురం తపాలాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌ ఎన్‌వి సత్యనారాయణ రాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం తపాల సూపరింటెండెంట్‌ సత్యనారాయణరాజు

పార్వతీపురంటౌన్‌, జూన్‌ 21: కరోనా విజృంభిస్తున్న తరుణంలో యోగా చేసి ఆరోగ్యంగా జీవించాలని పార్వతీపురం తపాలాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌ ఎన్‌వి సత్యనారాయణ రాజు అన్నారు. సోమవారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన తపాలాశాఖ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలాశాఖ వారం రోజుల పాటు యోగాకి సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించిందని, కరోనా సమయంలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా వర్చువల్‌ యోగా తరగతులను నిర్వహించామన్నారు. అలాగే ఏయూ యోగా కళాశాల ప్రొపెషర్‌ సుధాకర్‌ ద్వారా 70 మంది ఉద్యోగులకు వెబ్‌ తరగతుల్లో శిక్షణ ఇచ్చామన్నారు. పార్వతీపురం డివిజన్‌లో ఉన్న మండలాల ప్రజలు విదేశాలకు వెళ్లేం దుకు పాస్‌పోర్టు కోసం విశాఖపట్నం వెళ్లి నానా ఇబ్బందులు పడేవారని, త్వరలో పార్వతీపురంలోనే పాస్‌పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, బొబ్బిలిలో ఆధార్‌ నమోదు కేంద్రాల ద్వారా విజయవంతంగా సేవలందిస్తున్నా మన్నారు. 13 పోస్టుఫీసుల ద్వారా నగదు రహిత సేవలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. సహాయ తపాలాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌ ఆర్‌.నవీన్‌కుమార్‌, పోస్టుమాస్టర్‌ సుధాకర్‌ పాల్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T05:43:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising