ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరండాల్లో విద్యార్థులు

ABN, First Publish Date - 2021-11-03T04:24:24+05:30

ప్రభుత్వం మొదలుపెట్టిన నూతన విద్యా విధానంతో జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో విలీనమైన విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. ఆహ్లాదకర వాతావరణంలో ఇన్నాళ్లూ చదువుకున్న వారు కొత్త పాఠశాలల్లో స్థలం సరిపోక వరండాల్లో కూర్చుంటున్నారు. వారికి బెంచీలు కూడా వేసే పరిస్థితి లేదు.

జామి జిల్లా పరిషత ఉన్నత పాఠశాల వరండాలో కూర్చొన్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొదలైన విలీన ఇక్కట్లు

ఉన్నత పాఠశాలల్లో గదులు సరిపోక ఇబ్బందులు

సొబగులు అద్దిన ప్రాథమిక పాఠశాలలు ఖాళీ

శృంగవరపుకోట, నవంబరు 2:

ప్రభుత్వం మొదలుపెట్టిన నూతన విద్యా విధానంతో జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో విలీనమైన విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. ఆహ్లాదకర వాతావరణంలో ఇన్నాళ్లూ చదువుకున్న వారు కొత్త పాఠశాలల్లో స్థలం సరిపోక వరండాల్లో కూర్చుంటున్నారు. వారికి బెంచీలు కూడా వేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన పేద విద్యార్థులు అత్యధికంగా చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలన్నీ నివాసాలకు సమీపంలో ఉన్నాయి. అత్యధిక శాతంపిల్లలు ఈ పాఠశాలల్లోనే చదువుతున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం ‘నాడు-నేడు’ కార్యక్రమంతో అత్యధికంగా నిధులను ఖర్చుచేసి పాఠశాలలను  ఆధునీకరించింది. దీనివల్ల ఈ ఏడాది ప్రవేశాలు కూడా పెరిగాయి. అంతా బాగుందనుకుంటున్న సమయంలో ప్రభుత్వం విలీన నిర్ణయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలిపేసింది. దీంతో దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లడం ఒకెత్తయితే.. అక్కడ కూర్చొనేందుకు స్థలం లేకపోవడం మరో సమస్య. వరండాలో నేలపై కూర్చోవాల్సి వస్తోంది. కొత్త వాతావరణంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆడుకునేందుకు విశాలమైన మైదానం కూడా కరువయ్యే పరిస్థితి. 

ట్రిపుల్‌ ఐటీకి ఎంపికలో ప్రాధాన్యం, ఇతర ప్రభుత్వ పరమైన సదుపాయాలు ఉండడంతో గత పదేళ్లగా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఆరు నుంచి పదో తరగతి వరకు గల విద్యార్థులకే గదులు సరిపోవడం లేదు. మరుగుదొడ్ల సమస్య ఉంది. ఆట స్థలాల కొరత సరేసరి. ఇప్పుడు అదనంగా ప్రాథమిక  పాఠశాలలను విలీనం చేయడంతో అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులతో మరింత ఇరుగ్గా జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలు మారాయి. వీరిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రశ్నించే తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. 


Updated Date - 2021-11-03T04:24:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising