ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌలు రైతులకు సకాలంలో రుణాలివ్వండి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-07-13T04:40:07+05:30

కౌలు రైతులకు పంట రుణాలు సకాలంలో అందేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, జూలై 12(ఆంధ్రజ్యోతి):కౌలు రైతులకు పంట రుణాలు సకాలంలో అందేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. కలెక్ట రేట్‌ నుంచి సోమవారం ఆయన అధికారులతో వీడియో సమీక్షలో మాట్లాడారు. ఇప్పటివరకూ లక్షా 11వేల 456 మంది కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు జారీ చేయగా వారిలో 85 వేల మంది పంట రుణాలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ 8,196 మంది కౌలు రైతులకు 35 కోట్ల రూపాయల రుణాలు మంజూరయ్యాయన్నారు.  రైతు భరోసా చైతన్యయాత్రల్లో అధికారులు పంటలపై రైతులకు విలువైన సమా చారం ఇవ్వాలన్నారు. జిల్లాలో 45 ఏళ్లు పైబడిన 80 శాతం మందికి కొవిడ్‌ టీకా పూర్తిచేశామన్నారు. థర్డ్‌ వేవ్‌కు ముందస్తుగా గుర్తించిన ప్రైవేటు ఆస్పత్రుల్లో మౌలిక వసతులు త్వరగా పూర్తిచేయాలన్నారు.  మున్సిపల్‌ ప్రత్యేక అధికారులు అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, అమృత్‌ పథకం కింద చేపట్టిన వివిధ మంచినీటి సరఫరా పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. సమీక్షలో జేసీలు వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ భాస్కర్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో భాను నాయక్‌, డీసీహెచ్‌ఎస్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-13T04:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising