ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం బకాయిలు చెల్లించాలని ఎమ్మెల్యే నిమ్మల ధర్నా

ABN, First Publish Date - 2021-05-30T05:43:30+05:30

జిల్లాలో రబీ పంట ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించకుండా ప్రభుత్వం మోసగిస్తోందని, వెంటనే రూ.1200 కోట్లు బకాయిలను చెల్లించాలని పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు డిమాండ్‌ చేశారు.

తహసీల్దార్‌కి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే నిమ్మల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు, మే 29 : జిల్లాలో రబీ పంట ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించకుండా ప్రభుత్వం మోసగిస్తోందని, వెంటనే రూ.1200 కోట్లు బకాయిలను చెల్లించాలని పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు డిమాండ్‌ చేశారు. పాలకొల్లు మండల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద శనివారం ఆయన రైతులతో కలిసి  నిరసన కార్యక్రమం జరిపారు. తహసీల్దార్‌ జి.మమ్మికి వినతి పత్రం అందజేశారు. ధాన్యం కొనుగోళ్లు లేక, బకాయిలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నా రన్నారు. కౌలు రైతు పరిస్థితి ధాన్యం అమ్ముకోలేక ముందు నుయ్యి వెనుక గొయ్యి చందాన తయారైందన్నారు. ఆందోళనలో నియోజకవర్గానికి చెందిన రైతు సంఘాల నాయకులు, కౌలు రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


కరోనా మృతులకు రూ. 10 లక్షలు ఇవ్వాలి : నిమ్మల

యలమంచిలి, మే 29 : ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని, ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్స్‌ సామర్థ్యం పెంచాలని, ప్రభుత్వం పేదలకు రూ.10వేలు ఆర్థిక సాయం అందించాలని ఎమ్మెల్యే నిమ్మల డిమాండ్‌ చేశారు. మండలంలోని కొంతేరులో శనివారం సైకిల్‌పై పర్యటించారు. గ్రామంలోని కొవిడ్‌ బాధితులను పరామర్శించి నిత్యావసరాలు, పౌష్ఠికాహారం అందజేశారు.కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. 

Updated Date - 2021-05-30T05:43:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising