ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి

ABN, First Publish Date - 2021-10-07T05:57:52+05:30

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్య కర్తలు పోరాడాలని టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న గన్ని వీరాంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గన్ని 

గణపవరం, అక్టోబరు 6 :రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్య కర్తలు పోరాడాలని టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. పిప్పర పార్టీ కార్యాలయంలో గణపవరం మండల టీడీపీ సర్వసభ్య సమావేశంం అధ్యక్షుడు ఇందు కూరి రామకృష్ణంరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధా నాల వల్ల అన్ని రంగాలు కుదేలయ్యాయని, ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షాలను భయబ్రాంతుల కు గురి చేసేలా పాలన సాగుతుందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచే ప్రసక్తి లేదని ప్రకటించి ఇప్పుడు ట్రూ ఆఫ్‌ పేరుతో భారం మోపడం దారుణమని విమర్శించా రు. ఇందుకూరి రామకృష్ణంరాజు మాట్లాడుతూ రహదారు లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని మౌలిక సదుపాయా ల కల్పనలో ప్రభుత్వం విఫలమైం దన్నారు. సమవేశం లో ఏలూరు పార్లమెంట్‌ టీడీపీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి యాళ్ల సుబ్బారావు, పార్టీ రైతు ప్రధాన కార్యదర్శి కవల కోదండ రాంబాబు, పిప్పర మాజీ ఉప సర్పంచ్‌ దాట్ల రంగరాజు, ముప్పర్తిపాడు పార్టీ అధ్యక్షుడు అల్లూరి బద్రీనారా యణ, మొయ్యేరు మాజీ సర్పంచ్‌ ఇంటూరి చంద్రమోహనరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-07T05:57:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising