ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తగదు : జనసేన

ABN, First Publish Date - 2021-12-20T04:49:21+05:30

విశాఖ ఉక్కును పరిరక్షించాలని, ప్రైవే టీకరణ జరగకుండా నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడి పైనా ఉందని జన సేన ఏలూరు ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు అన్నారు.

ఏలూరులో నిరసన తెలుపుతున్న అప్పలనాయుడు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కార్పొరేషన్‌, డిసెంబరు 19: విశాఖ ఉక్కును పరిరక్షించాలని, ప్రైవే టీకరణ జరగకుండా నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడి పైనా ఉందని జన సేన ఏలూరు ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు అన్నారు. జనసేన అధిష్ఠానం పిలుపు మేరకు ఆదివారం పాతబస్టాండ్‌ సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు సంయుక్తంగా ప్లకార్డులతో విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. అప్పలనాయుడు మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణత్యాగం వల్ల విశాఖ ఉక్కు సాధించుకున్నామ ని, దానిని ప్రైవేటీ కరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తన పార్టీ ఎంపీలతో పార్లమెంటులో ప్రైవేటీకరణ చేయవద్దని కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు ఇ.శ్రీనివాస్‌, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రావణగుప్త, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీనరేష్‌, మండల అధ్యక్షుడు వీరంకి పండు, కార్యదర్శి సరిది రాజేష్‌, జనసేన నేతలు బొత్స మధు, పైడి లక్ష్మణరావు, రమణ, వీర మహిళలు కావూరి వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

పెదవేగి : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని, దానిని ప్రైవేటీకరిస్తే సహించేది లేదని పేర్కొంటూ జనసేన పార్టీ నాయకులు నడిపల్లిలో ఆదివారం ప్లకార్డుల ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ కొఠారు ఆది శేషు మాట్లాడుతూ వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ ఆలోచన దురదృష్టకరమ న్నారు. ఈ విషయమై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ను ప్లకార్డుల ప్రదర్శన ద్వారా కోరుతున్నామని వివరించారు. ముత్యాల రాజేష్‌, మట్టా రంగబాబు, జిజ్జువరపు సురేష్‌, కూచిపూడి గంగరాజు, రవి, కలపాల ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-20T04:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising