ఊరంతా.. కేరింత
ABN, First Publish Date - 2022-01-01T04:50:06+05:30
మధురానుభూతులు, చేదు జ్ఞాపకాలను తీసుకుని 2021 వెళ్లిపోగా ఆశల నవోదయంతో 2022 ఆవిష్కర ణమైంది.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన ప్రజలు
ఏలూరు కల్చరల్/పెదపాడు, డిసెంబరు 31 : మధురానుభూతులు, చేదు జ్ఞాపకాలను తీసుకుని 2021 వెళ్లిపోగా ఆశల నవోదయంతో 2022 ఆవిష్కర ణమైంది. ఏలూరు నగరంతో పాటు రూరల్ గ్రామాల ప్రజలు నవ వసంతా నికి ఘనంగా ఆహ్వానం పలికారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోయారు. నగర వీధులతో పాటు, గ్రామాల్లోని ముఖ్య కూడళ్లన్నీ యువతతో నిండిపోయాయి. అపార్టుమెంట్లు, కాలనీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి సందడి చేశారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. స్వీట్ స్టాళ్ళు, బేకరీల్లో కేక్‌ల కొనుగోళ్లకు యువత ఆసక్తి చూపారు. బొకేలు, కేక్‌లు, రంగులు, పూలు కొనుగోళ్ళతో మార్కెట్‌లు కిటకిటలాడాయి. ప్రతీ వైన్‌షాపు అర్ధరాత్రి వరకు అమ్మకాలతో బిజీగా ఉంది. మహి ళలు ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేసి కొత్త ఏడాదికి స్వా గతం పలికారు. పెదపాడు మం డలంలో అన్ని గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. పెద పా డు బస్టాండ్ సెంటర్‌లో పళ్ల దు కాణాల వద్ద, బేకరీల వద్ద కేక్‌ల కొనుగోళ్లతో సందడి కన్పించింది.
Updated Date - 2022-01-01T04:50:06+05:30 IST