రాట్నాలమ్మ సేవలో సింధు

ABN, First Publish Date - 2021-03-26T05:41:00+05:30

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ వారిని గురువారం సాయంత్రం దర్శించుకుని పూజలు చేశారు.

రాట్నాలమ్మ సేవలో సింధు
అమ్మ వారిని ప్రార్థిస్తున్న పీవీ సింధు, ఆమె తండ్రి వెంకటరమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదవేగి, మార్చి 25 : బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పెదవేగి మండలం రాట్నాలకుంట  రాట్నాలమ్మ వారిని గురువారం సాయంత్రం దర్శించుకుని పూజలు చేశారు. తండ్రి వెంకటరమణతో కలిసి వచ్చిన ఆమెకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ఉత్సవకమిటీ చైర్మన్‌ చల్లగొళ్ళ వెంకటేశ్వరరావు శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలు ఇచ్చి గౌరవించారు. రాట్నాలమ్మ దర్శనానంతరం పునఃనిర్మాణంలో ఉన్న ఆలయాన్ని పరిశీలించి, ఆనందం వ్యక్తం చేశారు.మెగా టోర్నీల సమయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆమెకు ఆనవాయితీ. కరోనా మహమ్మారి రెండో దశలో ఉండడంతో ముందస్తు సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటించారు. 

Updated Date - 2021-03-26T05:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising