ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విస్తారా, ఇండిగో విమాన సర్వీసులపై తౌక్తే తుపాన్ ప్రభావం

ABN, First Publish Date - 2021-05-15T17:44:50+05:30

తౌక్తే తుపాన్ ప్రభావం విస్తారా, ఇండిగో విమాన సర్వీసులపై పడనుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : తౌక్తే తుపాన్ ప్రభావం విస్తారా, ఇండిగో విమాన సర్వీసులపై పడనుంది. తుపాన్ ప్రభావం వల్ల తమ విమాన సర్వీసుల రాకపోకలను రద్దు లేదా రీ షెడ్యూల్ చేస్తున్నామని విస్తారా, ఇండిగో విమానయాన సంస్థలు ప్రకటించాయి. శనివారం రాత్రికి తౌక్తే తుపాన్ వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో రాబోయే రెండు రోజుల పాటు కొన్ని విమాన సర్వీసులను రద్దు లేదా రీ షెడ్యూల్ చేస్తున్నామని విస్తారా ఫ్లయర్స్ ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారడం వల్ల చెన్నై, తిరువనంతపురం, కొచ్చి, బెంగళూరు, ముంబై, పూణే, గోవా, అహ్మదాబాద్ నగరాలకు విమాన సర్వీసులు మే 17వతేదీ వరకు ప్రభావితం అయ్యే అవకాశముందని విస్తారా వెల్లడించింది. తుపాన్ కారణంగా తమ విమాన సర్వీసులను కూడా రద్దు చేసే అవకాశముందని ఇండిగో తెలిపింది. తౌక్తే తుపాన్ వల్ల సముద్ర తీరప్రాంతాల్లో గాలులు వేగంగా వీస్తున్నందున విమానాల రాకపోకలను రద్దు చేసే పరిస్థితి ఏర్పడిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు.

Updated Date - 2021-05-15T17:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising