ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫార్మా ప్రొడక్ట్స్ సింథసిస్ ప్రాజెక్ట్ కోసం రూ. 400 కోట్లు : దివీస్...

ABN, First Publish Date - 2021-05-30T20:41:07+05:30

బల్క్ డ్రగ్ కంపెనీ దివీస్ ఫార్మా నాలుగవ త్రైమాసికంలో లాభాల పంట పండింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : బల్క్ డ్రగ్ కంపెనీ దివీస్ ఫార్మా నాలుగవ త్రైమాసికంలో లాభాల పంట పండింది. నికరంగా రూ. 488 కోట్ల లాభాన్నార్జించింది. కంపెనీ ఆపరేషనల్ రెవెన్యూ కూడా 25 శాతం పెరుగుదలతో రూ. 1718 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది  రూ. 1376 కోట్లుగా నమోదైన విషయం తెలిసిందే.  మరిన్ని వివరాలిలా ఉన్నాయి.


మార్చి 31 తో ముగిసిన 2021 ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దివీస్ ల్యాబరేటరీస్ నికరలాభం 24.5శాతం వృద్ధితో రూ. 488 కోట్లకు ఎగసింది. గతేఏడాది ఇదే కాలంలో ఇది రూ. 392కోట్లు మాత్రమే. కంపెనీ బోర్డు తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ. 20 డివిడెండ్ ప్రకటించింది. 


కంపెనీ చేసే వ్యాపారం, నిత్యావసర వినియోగ జాబితాలో ఉండటంతో లాక్‌డౌన్లు సంస్థ కార్యకలాపాలపై పెద్దగాప్రబావం చూపలేదని... ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంలో  బోర్డు  పేర్కొంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 1,183 కోట్ల అసెట్స్‌ను కేపిటలైజ్  చేయగా,రూ. 710.62కోట్ల మేర కేపిటల్ వర్క్(క్యారీ ఫార్వార్డ్ అయినవి) ప్రోగ్రెస్‌లో ఉన్నట్లు తెలిపింది. అలానే రాబోయే రోజుల్లో త్వరితగతిన పూర్తయ్యేందుకు ఫార్మా ప్రొడక్ట్స్ సింథసిస్ ప్రాజెక్ట్ కోసం రూ. 400 కోట్లు అదనంగా వ్యయం చేయనున్నట్లు వెల్లడించింది. 

Updated Date - 2021-05-30T20:41:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising