ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిసెంబరు 10 నుంచి... గృహ రుణ రేటు పెంపు...

ABN, First Publish Date - 2021-11-09T10:08:46+05:30

ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌... గృహ రుణ వడ్డీరేటు స్వల్పంగా పెరిగింది. డిసెంబరు పదో తేదీ నుంచి కొత్త రేటు అమల్లోకి రానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌... గృహ రుణ వడ్డీరేటు స్వల్పంగా పెరిగింది. డిసెంబరు పదో తేదీ నుంచి కొత్త రేటు అమల్లోకి రానుంది. కాగా... ఈ క్రమంలో... కొత్త వడ్డీ రేటు 0.05 శాతం మేర పెరగనుంది. వడ్డీరేట్ల పెంపునకు అవకాశముందన్న అంచనాల నేపధ్యంలో... కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌ గృహ రుణ రేటు ప్రస్తుతం  6.50 శాతం కాగా, డిసెంబరు పదో తేదీ నుంచి ఇది 6.55 శాతానికి పెరగనుంది. పండుగల సీజన్‌ నేపధ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంకు...  సెప్టెంబరులో వడ్డీరేటును తగ్గించింది. ఆ క్రమంలోనే... ఇతర బ్యాంకులు కూడా అదే దిశలో  నిర్ణయం తీసుకున్నాయి.తమ ప్రత్యేక 60 రోజుల పండుగల సీజన్‌ ఆఫర్‌కు ఖాతాదారుల నుంచి మంచి స్పందన లభించినట్లు బ్యాంక్‌ కన్స్యూమార్ బిజినెస్‌ వ్యవహారాల ప్రెసిడెంట్‌ అంబుజ్‌ పేర్కొన్నారు. కోటక్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కోటక్‌ ఆదివారం చేసిన ఓ ట్వీట్‌ నేపధ్యంలో బ్యాంక్‌ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

Updated Date - 2021-11-09T10:08:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising