ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎస్‌టీ కౌన్సిల్ భేటీ ఎల్లండి

ABN, First Publish Date - 2021-09-15T20:51:22+05:30

దేశవ్యాప్తంగా ఒకే తరహా పన్నులు’ నేపధ్యంలో... కేంద్రప్రభుత్వం... గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జీఎస్‌టీ)ను అమల్లోకి తీసుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ‘దేశవ్యాప్తంగా ఒకే తరహా పన్నులు’ నేపధ్యంలో... కేంద్రప్రభుత్వం... గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జీఎస్‌టీ)ను అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వేర్వేరు పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వేర్వేరు పన్నులకు బదులు జీఎస్‌టీ  వ్యవస్థను ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్, మద్యం వంటి కొన్నింటిని మినహాయించి, మిగిలినవన్నీ  జీఎస్‌టీ పరిధిలో కొనసాగుతున్నాయి. వాటి ద్వారా ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది.


ఇప్పటివరకు  గరిష్ఠంగా రూ. 1,42 లక్షల కోట్ల  ఆదాయాన్ని కేంద్రం అందుకుంది. కాగా... జీఎస్‌టీ కౌన్సిల్ శుక్రవారం సమావేశం కాబోతున్నన విషయం తెలిసిందే. వర్చువల్ విధానంలో ఈ  భేటీ జరగనుంది. న్యూఢిల్లీకి బదులుగా లక్నోలో ఈ సమావేశం జరగనుంది. కాగా... పెట్రోల్, డీజిల్‌లను కూడా జీఎస్‌టీ పరిధిలోకి తీసుకుని వచ్చే అంశాన్ని ఆర్థికమంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందంటూ వార్తలొస్తోన్న నేపధ్యంలో... జరగనున్న ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

Updated Date - 2021-09-15T20:51:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising