ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్రో బ్రాండ్స్‌ ఇష్యూ ధర శ్రేణి రూ.485-500

ABN, First Publish Date - 2021-12-08T08:08:02+05:30

పాదరక్షల రిటైల్‌ విక్రయ కేంద్రాల కంపెనీ ‘మెట్రో బ్రాండ్స్‌ లిమిటెడ్‌’ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ ఈ నెల 10న ప్రారంభమై 14న ముగియనుంది......

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాదరక్షల రిటైల్‌ విక్రయ కేంద్రాల కంపెనీ ‘మెట్రో బ్రాండ్స్‌ లిమిటెడ్‌’ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ ఈ నెల 10న ప్రారంభమై 14న ముగియనుంది. ఐపీఓలో విక్రయించే షేర్ల ధర శ్రేణిని కంపెనీ రూ.485-500గా నిర్ణయించింది. ప్రముఖ ఈక్విటీ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు కలిగిన ఈ కంపెనీ.. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1,368 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇష్యూలో రూ.295 కోట్ల విలువైన తాజా ఈక్విటీని జారీ చేయనుండటంతోపాటు ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులకు చెందిన 2.14 కోట్ల షేర్లను ఓఎ్‌ఫఎస్‌ మార్గంలో విక్రయించనుంది. తాజా ఈక్విటీ ద్వారా సేకరించే నిధులను మెట్రో, మోచీ, వాక్‌వే, క్రాక్స్‌ బ్రాండ్‌ నేమ్‌తో కొత్త స్టోర్ల ఏర్పాటుతోపాటు సాధారణ అవసరాలకు ఉపయోగించుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలోని 136 నగరాల్లో 598 స్టోర్లను నిర్వహిస్తోంది.

Updated Date - 2021-12-08T08:08:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising