ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.1.6 లక్షల కోట్లు

ABN, First Publish Date - 2021-05-27T09:28:13+05:30

కరోనా సంక్షోభంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ జీఎస్‌టీ వసూళ్లు బడ్జెట్‌ అంచనాల కంటే తగ్గవచ్చన్నఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే, రాష్ట్రాలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రంపై అదనపు  రుణభారం 

రాష్ట్రాల ఆదాయ లోటు పూడ్చేందుకే 

కొవిడ్‌తో జీఎ్‌సటీ ఆదాయానికి రెండో ఏడాదీ గండి!!


న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ జీఎస్‌టీ వసూళ్లు బడ్జెట్‌ అంచనాల కంటే తగ్గవచ్చన్నఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే, రాష్ట్రాలకు ఆదాయలోటు పూడ్చేందుకు కేంద్ర ప్రభు త్వం ఈ ఏడాదీ అప్పులు చేయాల్సిరావచ్చని వారంటున్నారు. రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు ఈసారి రూ.1.58 లక్షల కోట్ల వరకు అదనంగా రుణాలు సమీకరించాల్సి రావచ్చని ఈ వ్యవహారంపై అవగాహన కలిగిన వ్యక్తులు తెలిపారు. 2021-22లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.2.7 లక్షల కోట్ల మేర చెల్లించాల్సి రావచ్చని, పరిహార సుంకం ద్వారా రూ.1.1 లక్షల కోట్ల వరకు వసూలయ్యే అవకాశాలున్నాయని వారన్నారు. మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు రుణాల సమీకరించక తప్పకపోవచ్చని వారన్నారు. ద్రవ్యలోటును(ఆదాయ, వ్యయాల మధ్య అంతరం) పూడ్చుకునేందుకు ఈసారి రూ.12 లక్షల కోట్ల మేర రుణాలు సేకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రకటించారు. రాష్ట్రాల ఆదాయ లోటు భర్తీకి చేయాల్సిన అప్పు ఇందుకు అదనం. రాష్ట్రాలకు పరిహారం చెల్లింపులతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా జీఎస్‌టీ మండలి సమావేశం కానుంది.

  

పాన్‌ మసాలాపై తయారీ దశలోనే పన్ను 

పాన్‌మసాలా, గుట్కా, ఇటుక బట్టీలు, మైనింగ్‌ రంగాలపై ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా జీఎ్‌సటీ విధించాలని ప్రభు త్వం యోచిస్తోంది. ఒడి శా ఆర్థిక మంత్రి నిరంజన్‌ పూజారి అధ్యక్షతన ఏడుగురు సభ్యుల మం త్రుల బృందం(జీఓఎం) ఈ విషయాన్ని పరిశీలించనుంది. అలాగే, పాన్‌ మసాలా తయారీలో ఉపయోగించే మెంతో ఆయిల్‌ తదితర ముడిసరుకుల సరఫరాపై రివర్స్‌ చార్జ్‌ పద్ధతిలో పన్ను విధించే అవకాశాలనూ పరిశీలించనుంది. ఈ రంగాల్లో పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేయడమే తాజా ప్రతిపాదనల ఉద్దేశం. ఉత్పత్తి దశలో పన్ను సాధ్యాసాధ్యాలను సమీక్షించి ఆరు నెలల్లోగా జీఎస్‌టీ మండలికి జీఓఎం నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 




క్యాసినో, ఆన్‌లైన్‌ గేమింగ్‌ సేవల విలువ మదింపు 

దేశంలో క్యాసినోలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ పోర్టళ్లు, రేస్‌ కోర్సుల సేవల విలువను లెక్కించేందుకు గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ అధ్యక్షతన ఏడుగురు మంత్రుల బృందం(జీఓఎం) ఏర్పాటైంది. ఈ వ్యాపారాల సేవల విలువను మరింత పెంచేందుకు చట్టపరమైన మార్పులేమైనా చేయాలా దిశగా జీఓఎం సమీక్ష జరిపి 6 నెలల్లో జీఎ్‌సటీ మండలికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ మూడు రంగాల సేవలపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం జీఎ్‌సటీ విధిస్తున్నది. 

Updated Date - 2021-05-27T09:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising