15100 పైన నిఫ్టీ సురక్షితం
ABN, First Publish Date - 2021-03-22T06:03:42+05:30
నిఫ్టీ గత వారం 15000 స్థాయిలో నిలదొక్కుకోలేక మరింత కరెక్షన్ ట్రెండ్‌లో ట్రేడయి 14400 వరకు
నిఫ్టీ గత వారం 15000 స్థాయిలో నిలదొక్కుకోలేక మరింత కరెక్షన్ ట్రెండ్‌లో ట్రేడయి 14400 వరకు దిగజారింది. ఆ స్థాయిలో బలమైన రికవరీ సాధించి 14500 వద్ద మద్దతు తీసుకోవడం స్వల్పకాలిక కరెక్షన్ ముగిసిందనేందుకు సంకేతం. గత 3 నెలల్లో కూడా మార్కెట్ 14500 స్థాయిలో పలుమార్లు రికవరీ సాధించింది. కాని ఇంకా బలాన్ని ప్రదర్శించలేకపోవడం, వీక్లీ చార్టుల్లో వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల నడుమ అనిశ్చితంగా ముగియడం సైడ్‌వేస్ ధోరణి మరికొంత కాలం ఉంటుందని సూచిస్తున్నాయి.
టెక్నికల్‌గా మైనర్ అప్‌ట్రెండ్ ఏర్పడింది. మరింత పుల్‌బ్యాక్ రికవరీకి ఆస్కారం ఉంది. మార్కెట్ ప్రస్తుతం 20, 50 డిఎంఏల కన్నా స్వల్పంగా పైన ఉంది. కాని స్వల్పకాలిక నిరోధం 15000 కన్నా దిగువనే ట్రేడవుతోంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌లో మరింతగా పురోగమించాలంటే ఇక్కడ బలాన్ని ప్రదర్శించడం అవసరం.
బుల్లిష్ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్ కోసం మైనర్ నిరోధం 14900 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన స్వల్పకాలిక నిరోధం 15100. ఇక్కడ స్వల్పకాలిక కన్సాలిడేషన్ ఉండవచ్చు. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ను కొనసాగించాలంటే ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి.
బేరిష్ స్థాయిలు : మానసిక అవధి 15000 వద్ద విఫలమైతే కరెక్షన్ ముప్పు ఎదుర్కొంటుంది. ప్రధాన మద్దతు స్థాయి 14600 కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 14400.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 1350 పాయింట్ల నష్టంతో వారం కనిష్ఠ స్థాయికి చేరువలో క్లోజయింది. ప్రధాన నిరోధ స్థాయిలు 34600, 35200. ఆ పైన మాత్రమే మరింత అప్‌ట్రెండ్ ఉంటుంది. మద్దతు స్థాయి 34000 కన్నా దిగజారితే అప్రమత్తం కాక తప్పదు.
పాటర్న్: 15100 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద గట్టి నిరోధం ఎదురవుతోంది. మరింత అప్‌ట్రెండ్ కోసం ఈ రేఖను ఛేదించాలి. 14600 వద్ద ‘‘ఏటవాలుగా దిగువకు ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద గత నాలుగు నెలల్లో నాలుగు బాటమ్‌లు ఏర్పడ్డాయి. అంతకన్నా దిగజారితే బలహీనత తప్పదు.
టైమ్: ఈ సూచి ప్రకారం బుధవారంనాడు తదుపరి రివర్సల్ ఉంది.
సోమవారం స్థాయిలు
నిరోధం : 14820, 14900
మద్దతు : 14660, 14600
www.sundartrends.in
Updated Date - 2021-03-22T06:03:42+05:30 IST