మన కుబేరుడు దమానీ
ABN, First Publish Date - 2021-08-19T20:27:08+05:30
డిమార్ట్ అధినేత, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, బిలియనీర్ రాధాకిషన్ ధమానికి ప్రపంచ టాప్ 100 కుబేరుల జాబితాలో చోటు దక్కింది.
హైదరాబాద్ : డిమార్ట్ అధినేత, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, బిలియనీర్ రాధాకిషన్ ధమానికి ప్రపంచ టాప్ 100 కుబేరుల జాబితాలో చోటు దక్కింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఈ జాబితాలో 97వ స్థానం దక్కించుకున్న దమానీ నికరాదాయం 19.3 బిలియన్ డాలర్లు. ఇక... బ్లూమ్‌బర్గ్ టాప్ 100 కుబేరుల తాజా జాబితాలో ఐదుగురు భారతీయులకు చోటు దక్కింది. ఇందులో రిటైల్ సూపర్ మార్కెట్ చైన్ డిమార్ట్ ప్రమోటర్ ఆర్కే దమానీ తొలిసారి టాప్ 100 లో చోటు దక్కించుకున్నారు. మొత్తం 1,930 కోట్ల డాలర్ల(అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 1,42,540 కోట్లు) ఆదాయంతో 97 వ స్థానంలో నిలిచారు.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ టాప్ 100 ఇండెక్స్ ప్రకారం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 8,238 కోట్ల డాలర్ల ఆస్తులతో 12 వ స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 5,458 కోట్ల డాలర్ల ఆస్తులతో నాలుగవ స్థానంలో నిలిచారు. ఇక... 3,718 కోట్ల డాలర్ల ఆస్తులతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ 36 వ స్థానంలో, 2,858 కోట్ల డాలర్ల ఆస్తులతో హెచ్‌సీఎల్ అధినేత శివనాడార్ 52 వ స్థానంలో, 2,248 కోట్ల డాలర్ల ఆస్తులతో లక్ష్మీ మిట్టల్ 75 వ స్థానంలో నిలిచారు. కాగా... ఆర్కే దమానీ రిటైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి ముందు 1990 ల్లో పెద్దఎత్తున వ్యాల్యూ ఓరియెంటెడ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత రిటైల్ వ్యాపారం ‘డీ మార్ట్’ను స్థాపించారు.
Updated Date - 2021-08-19T20:27:08+05:30 IST