ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

77 డాలర్లు దాటిన చమురు ధర

ABN, First Publish Date - 2021-07-06T06:44:51+05:30

పెట్రోలియం ఉత్పత్తి దేశాల కూటమి ‘ఒపెక్‌’లో విభేధాలు భగ్గుమన్నాయి. ఉత్పత్తి పెంపు కోసం సోమవారం ఈ దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్‌: పెట్రోలియం ఉత్పత్తి దేశాల కూటమి ‘ఒపెక్‌’లో విభేధాలు భగ్గుమన్నాయి. ఉత్పత్తి పెంపు కోసం సోమవారం ఈ దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్‌ బ్రెంట్‌ రకం ముడి చమురు ధర సోమవారం ఒక దశలో 77.30 డాలర్లకు చేరింది. 2018 అక్టోబరు తర్వాత బ్రెంట్‌ చమురు ధర ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి. ఈ పెరుగుదల ఇలానే కొనసాగితే భారత్‌కు మరిన్ని తిప్పలు తప్పవని భావిస్తున్నారు. 


ఉత్పత్తి పెంపుపై విభేధాలు: ఈ ఏడాది ఆగస్టు నుంచి వచ్చే ఏడాది చివరి వరకు రోజువారీ ముడి చమురు ఉత్పత్తిని 20 లక్షల బ్యారళ్లు పెంచాలన్న సౌదీ అరేబియా, రష్యా ప్రతిపాదించాయి. యూఏఈ ఇందుకు ఏ మాత్రం అంగీకరించలేదు. ఈ పెంపును ఈ ఏడాది చివరి వరకే పరిమితం చేయాలని కోరింది. దీనికి  తోడు తన రోజువారీ ఉత్పత్తి కోటాను ప్రస్తుత 27 లక్షల నుంచి కనీసం 33 లక్షల బ్యారళ్లకు పెంచాలని కోరింది. సౌదీ, రష్యా వంటి దేశాలు ఇందుకు ఆమోదించలేదు. దీంతో గత  వారం రోజులుగా జరుగుతున్న చర్చలు విఫలమయ్యాయి.

Updated Date - 2021-07-06T06:44:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising