థాంక్స్ చెప్పిన జొమేటో సీఈఓ
ABN, First Publish Date - 2021-07-23T22:24:01+05:30
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఓలా, పేటీఎం, ఉబెర్ సంస్థలకు... జొమేటో సీఈఓ దీపేందర్ గోయల్... థాంక్స్ చెప్పారు.
హైదరాబాద్ : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఓలా, పేటీఎం, ఉబెర్ సంస్థలకు... జొమేటో సీఈఓ దీపేందర్ గోయల్... థాంక్స్ చెప్పారు. జొమాటఓ సంస్థ శుక్రవారం స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయిన విషయం తెలిసిందే. ఈసందర్భాన్ని పురస్కరించుకుని కృతజ్ఞతలు చెబుతున్నట్లు దీపిందర్ ఓ ప్రకటనలో తెలిపారు.
భవిష్యత్తు భారత్ ను నిర్మించే క్రమంలో పాలుపంచుకుంటున్న తమకు సాయపడుతున్న నేపధ్యంలో థాంక్స్ చెబుతున్నట్లు గోయల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. భారతీయ ఇంటర్నెట్ వ్యవస్థకు కూడా ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ అందరి సహకారం వల్లే జొమాటో ఈ రోజు ఈ స్థాయిలో నిలబడగలిగింది’ అని గోయల్ పేర్కొన్నారు. ‘ఇది నమ్మశక్యం కాని సహకారం’ అని వ్యాఖ్యానించారు.
Updated Date - 2021-07-23T22:24:01+05:30 IST