Luring Women: నగ్న చిత్రాలు, వీడియోలు పంపిన నిందితుడి అరెస్ట్
ABN, First Publish Date - 2021-07-23T17:56:51+05:30
మహిళల నగ్న చిత్రాలు, వీడియోలను తెప్పించుకొని వాటిని బయటపెడతానంటూ...

న్యూఢిల్లీ : మహిళల నగ్న చిత్రాలు, వీడియోలను తెప్పించుకొని వాటిని బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఢిల్లీ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన జతిన్ భరద్వాజ్ అనే యువకుడు దక్షిణాసియా దేశాలకు చెందిన మహిళలకు డబ్బులు ఇచ్చి వారి నగ్న చిత్రాలు, వీడియోలను తెప్పించుకొని, ఆ తర్వాత వాటిని బయటపెడతానంటూ బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అలా 15 మంది మహిళలను తన వలలో వేసుకున్నాడు. టాక్ ఫైల్ మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిచయమైన ఇండోనేషియా మహిళ ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి జతిన్ భరద్వాజ్ ను అరెస్టు చేశారు. అశ్లీల చిత్రాలు, వీడియోలున్న ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - 2021-07-23T17:56:51+05:30 IST