ఆదర్శ కమ్యూనిస్టు విప్లవకారుడు
ABN, First Publish Date - 2021-11-02T07:45:28+05:30
భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (మా–లె) సీనియర్ నాయకులు కా. గుమ్మి బక్కారెడ్డి (92) అక్టోబరు 24న మరణించారు. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి మరణించే...
భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (మా–లె) సీనియర్ నాయకులు కా. గుమ్మి బక్కారెడ్డి (92) అక్టోబరు 24న మరణించారు. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి మరణించే వరకూ కమ్యూనిస్టు విశ్వాసాలతో జీవించారాయన. బక్కారెడ్డి సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. సాయుధ పోరాట ప్రభావంతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమయింది. నమ్మకమైన కొరియర్‌గా ఆ పోరాటకాలంలో పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీలో, విప్లవకారులలో వచ్చిన మితవాద, అతివాద అవకాశవాద ధోరణులను వ్యతిరేకించి కా. డివి ప్రాతినిధ్యం వహించిన కమ్యూనిస్టు వివ్లవ రాజకీయాలను విశ్వసించి బలపరిచారు. ఆ ఆశయాలకే కట్టుబడి జీవితాంతం యుసిసిఆర్‌ఐ (యం.యల్.)తో కలిసి పనిచేశారు. గ్రామీణ పేదల సంఘం, ఓపిడిఆర్, భారత–చైనా మిత్రమండలి (ఐసిఎఫ్‌ఏ) వంటి ప్రజాసంఘాల కార్యక్రమాలలో పాల్గొని సహకరించారు. విప్లవం పేరు చెప్పుకుంటూ పాలకవర్గ గ్రూపుల హత్యా రాజకీయాలకు పనిముట్లుగా మారిన కొన్ని సంఘాల ధోరణిని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ క్రమశిక్షణను ప్రాణప్రదంగా భావించేవారు. సాయుధ పోరాట కాలంనాటి కమ్యూనిస్టు విప్లవకారుల మంచి లక్షణాలు అనేకం బక్కారెడ్డి జీవితంలో ప్రతిబింబించాయి. అవి ఈనాటి కమ్యూనిస్టు విప్లవ కారులందరికీ ఆదర్శప్రాయమైనవి. కామ్రేడ్ బక్కారెడ్డి స్వగ్రామం ఏపూరు, చిట్యాల మండలం, నల్లగొండ జిల్లాలో నేడు ఆయన సంస్మరణ సభ.
యుసిసిఆర్‌ఐ(యం–యల్)
Updated Date - 2021-11-02T07:45:28+05:30 IST