ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధులు తప్ప నిధులు లేని జెడ్పీ చైర్మన్లు

ABN, First Publish Date - 2021-01-27T06:47:52+05:30

పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా తయారైంది తెలంగాణలోని జిల్లా పరిషత్‌ల వ్యవహారం. కొత్తగా ఏర్పడిన జెడ్పీల పాలకవర్గాలు కొలువుదీరి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా తయారైంది తెలంగాణలోని జిల్లా పరిషత్‌ల వ్యవహారం. కొత్తగా ఏర్పడిన జెడ్పీల పాలకవర్గాలు కొలువుదీరి ఏడాది పైనే గడిచినా వారు సాధించింది శూన్యం. సర్కారు నుంచి నయాపైసా నిధులు రాకపోవడంతో సదరు ప్రజాప్రతినిధులు లబోదిబోమంటున్నారు. జిల్లా పరిషత్‌ల అభివృద్ధికి ఇతోధికంగా నిధులు విడుదల చేయాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపించింది. రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు జెడ్పీకి వివిధ రూపాల్లో సమకూరే ఆదాయం ద్వారా 35శాతం సాధారణ పనులు చేయాల్సి ఉంది. జెడ్పీసీల నుంచి వచ్చిన ప్రపోజల్స్‌ను లెక్కలోకి తీసుకొని జిల్లా ప్రజాపరిషత్‌లు ప్రభుత్వ భవనాలను, రోడ్లను అభివృద్ధి చేయాలి. జెడ్పీ కార్యాలయ నిర్వహణ కోసం 16శాతం, మహిళాశిశు సంక్షేమం, హరిజనుల అభివృద్ధి కోసం 15శాతం చొప్పున, గిరిజన సంక్షేమానికి 6శాతం చొప్పున నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. కానీ నిధులు రాకపోవడంతో జిల్లా ప్రజాపరిషత్తులు, మండల ప్రజాపరిషత్తులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి. ఎన్నో హామీలు ఇచ్చి గెలుపొందిన జెడ్‌్పీటీసీలు, మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. తెలంగాణలో 98శాతం మండలాధ్యక్షులు జెడ్‌్పీటీసీలు, జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్లు, అధికార పార్టీకి చెందినవారే కావడంతో కక్కలేక మింగలేక వారిలోవారే మధనపడుతున్నారు. జిల్లాపరిషత్తు పరిధిలో ఉన్న జనాభాకు తలసరిగా నాలుగు రూపాయల చొప్పున సర్కారు జెడ్పీకి జమచేయాలి. కాని అలా చేయడం లేదు. కంకర, ఇసుక, ఇతర క్వారీల ద్వారా వసూలైన డబ్బులో జిల్లా పరిషత్తుకు 25శాతం వాటా రావాల్సి ఉన్నా రావడం లేదు. సీవరేజి చార్జీల క్రింద ఒక్క పైసా కూడా జమ కావడం లేదు. జిల్లాలో భూముల క్రయవిక్రయ ధనం గతంలో జిల్లా పరిషత్‌ ఖజానాకి జమ అయ్యేది, ఇప్పుడు రాష్ట్ర ఖజానాకే నేరుగా వెళ్తుండటంతో జిల్లాపరిషత్తుల, మండలపరిషత్తుల ఉనికి, భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం తమకు విధులతో పాటు నిధులు కూడా కేటాయించాలని మండల ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులు, మండల ప్రజాపరిషత అధ్యక్షులు, జెడ్‌్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. ముఖ్యమంత్రి సైతం నిధులు విడుదల చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఏమైందో ఏమో కాని గతంలోని జెడ్పీలకు మంజూరైనట్టుగా నిధులు వీరికి మంజూరు కావడం లేదు. 

రావుల రాజేశం

Updated Date - 2021-01-27T06:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising