దశమూలారిష్ట
ABN, First Publish Date - 2021-01-19T21:17:17+05:30
ఆయుర్వేద వైద్యశాస్త్రంలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న ఔషధాలలో దశమూలారిష్ట ఒకటి. దశమూలాలు అనగా మారేడు, తుందిలము, గుమ్మడి, కలిగట్టు, నెల్లి, మయ్యాకు పొన్న,
ఆయుర్వేద వైద్యశాస్త్రంలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న ఔషధాలలో దశమూలారిష్ట ఒకటి. దశమూలాలు అనగా మారేడు, తుందిలము, గుమ్మడి, కలిగట్టు, నెల్లి, మయ్యాకు పొన్న, కోలపొన్న, వాకుడు, పెద్దములక, పల్లేరు. ఈ దశమూలాలతో కలిపి పలు యోగాల గురించి ఆయుర్వేదంలో వెల్లడించారు. దశమూలారిష్ట తయారీ, ఉపయోగాల గురించి బైషజ్య రత్నావళి, సహస్రయోగ తదితర ఆయుర్వేద గ్రంథాలలో వివరించారు.
దశమూలారిష్ట తయారీలో పైన చెప్పిన దశమూలాలతో పాటు చిత్రమూలం, పుష్కర మూలం, తిప్పతీగ, ఉసిరికాయ, మంజిష్ట, దేవదారు, గలిజేరు, జటామాంసి తదితర యాభైఐదు రకాల మూలికలతో కషాయంగా కాచి, అరిష్ట విధానంలో తయారుచేస్తారు.
దశమూలారిష్ట ఉపయోగాలు: గ్రహణి, అరుచి, శ్వాస, కాస, గుల్మ, భగంధరం, క్షయ, చర్ది, పాండు, కావాలా, కుష్ఠు, అర్శిస్సు, మేహ, మందాగ్ని, ఉదర, అశ్మరి, మూత్రకృచ్ఛాలు తదితర వ్యాధులనూ, ధాతు క్షయాన్నీ పోగొడుతుంది. దీన్ని సేవించడం వల్ల శరీరపుష్ఠి, తేజస్సు, శుక్రవృద్ధి, బలం కలుగుతాయి.
ఉపయోగించే మోతాదు: దీన్ని పెద్దలు 10 మిల్లీలీటర్లు, పిల్లలు ఐదు మిల్లీలీటర్లు ఉదయం, సాయంత్రం లేదా వైద్యుల సూచన ప్రకారం వాడాలి. ప్రస్తుతం ధూద్‌పాపేశ్వర్, బైౖధ్యనాఽథ్, వైద్యరత్న వంటి ఆయుర్వేద మందుల సంస్థలు దీన్ని తయారు చేస్తున్నాయి.
శశిధర్,
అనువంశిక వైద్య నిపుణులు,
సనాతన జీవన్ ట్రస్ట్, కొత్తపేట, చీరాల.
Updated Date - 2021-01-19T21:17:17+05:30 IST