యోగరాజ గుగ్గులు
ABN, First Publish Date - 2021-03-23T19:31:51+05:30
ఆయుర్వేద వైద్యంలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న ఔషధాలలో యోగరాజ గుగ్గులు ఒకటి. ఎక్కువగా వాత రోగాల చికిత్సలో ఉపయోగిస్తారు. దీని తయారీ, ఉపయోగాల గురించి చక్రదత్త, బైషజ్య రత్నావళి వంటి ఆయుర్వేద గ్రంథాలలో వివరంగా ఆరు శ్లోకాలతో రాసి ఉంది.
ఆంధ్రజ్యోతి(23-03-2021)
ఆయుర్వేద వైద్యంలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న ఔషధాలలో యోగరాజ గుగ్గులు ఒకటి. ఎక్కువగా వాత రోగాల చికిత్సలో ఉపయోగిస్తారు. దీని తయారీ, ఉపయోగాల గురించి చక్రదత్త, బైషజ్య రత్నావళి వంటి ఆయుర్వేద గ్రంథాలలో వివరంగా ఆరు శ్లోకాలతో రాసి ఉంది.
ఈ ఔషధంలో ముఖ్యంగా ఉండేది శుద్ధి చేసిన గుగ్గిలం. గుగ్గిలాన్ని పలురకాలుగా శుద్ధి చేస్తారు. ఎక్కువ ఉపయోగంలో ఉన్న పద్ధతి స్వేదన ప్రక్రియ. యోగరాజ గుగ్గులు తయారీలో గుగ్గిలం, చిత్రమూలం, పిప్పిలి మూలం, నల్లజీలకర్ర, వాయువిడంగాలు, దేవదారు, యాలుక, త్రిఫల, గోక్షుర, తుంగ వట్టి వేళ్లు, సైంధవ లవణం వంటి 25 మూలికలను ఉపయోగిస్తారు.
యోగరాజ గుగ్గులు వాడడం ద్వారా వాత, క్రిమి రోగాలు, దుష్ట వ్రణములు, ప్లీహ, ఉదర రోగాలు, అర్శిస్సుల నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటితో పాటు మా అనుభవంలో తెలిసిన మరికొన్ని ఉపయోగాలు- విరోచనం సరిగా కాకపోవడంతో కూడిన సయాటికా పెయిన్‌కు ఇది అనుపాతంగా ఉత్తమంగా పనిచేస్తుంది. అదేవిధంగా కొవ్వు గడ్డలు, వెరికోస్ వెయిన్స్ నందు ఇది విశేషంగా పనిచేస్తుంది. ఎక్కువమంది ఇబ్బంది పడుతున్న మడమశూల (మడమ లోపలి నుంచి వచ్చే నొప్పి)కి యోగరాజ గుగ్గులు అనుపానంగా బాగా పనిచేస్తుంది.
ఉపయోగించే మోతాదు: పెద్దలు రెండు మాత్రలు, పిల్లలు ఒక మాత్ర నీటితో తీసుకోవాలి. లేదా వైద్యుల సూచన ప్రకారం వాడాలి. ప్రస్తుతం యోగరాజ గుగ్గులును ఓషధీ ప్రకాశ్, దూత్‌పాపేశ్వర్, బైద్యనాథ్, జండూ వంటి ఆయుర్వేద సంస్థలు తయారుచేస్తున్నాయి.
- శశిధర్
అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు
సనాతన జీవన్ ట్రస్ట్
కొత్తపేట, చీరాల
Updated Date - 2021-03-23T19:31:51+05:30 IST